ప్రకృతిలో వినిపించే మంద్రమైన శబ్దాల కలయికే.. గ్రీన్ నాయిస్! ఇది వినడానికి చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఇందులో దూరం నుంచి వినిపించే జలపాతాల హోరు, నదీ ప్రవాహపు శబ్దాలు, గాలికి ఊగుతున్న చెట్ల ఆకుల గలగలలు, చిరుజల్లుల సరాగాలు అన్నీ మిళితమై ఉంటాయి.
కమ్మటి నిద్రకు మంత్రం.. మంద్రమైన సంగీతం! మనసుకు ఇంపైన పాటలు వింటే.. కంటికి కునుకు పట్టడం ఖాయం. అందుకే, చాలామంది పాటలను నైవేద్యంగా పెట్టి, నిద్రాదేవిని ఆహ్వానిస్తుంటారు. అయితే, నేటితరం మాత్రం.. నిద్రకోసం ‘గ్రీన్ నాయిస్’కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రకృతిలో ఉన్న అనుభూతిని పొందుతూ.. కంటినిండా నిద్రపోతున్నారు.

యూట్యూబ్, స్పాటిఫై లాంటి మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో green noiseఅని సెర్చ్ చేస్తే గంటల తరబడి ప్లే అయ్యే ఆడియో ట్రాక్స్ ఉచితంగా లభిస్తాయి. నిద్రలేమి, ఏకాగ్రత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. గ్రీన్ నాయిస్‌ను ప్రయత్నించి చూడొచ్చు!
