Gordon Ramsay | పాక ప్రపంచంలో సెలబ్రిటీ చెఫ్‌గా పేరొంది, పలు వంటలను నిశితంగా పరిశీలిస్తూ విమర్శలు చేయడంలో చేయితిరిగిన గార్డన్ రామ్సే ప్రసిద్ధ ఇండియన్ డిష్ తయారుచేశారు. రామ్సే దేశీ ఫుడ్‌పై నెటిజన్లు పెదవివిరిచారు. ఫేవరెట్ ఇండియన్ డిష్ బటర్ చికెన్ తయారుచేసే వీడియోను రామ్సే ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వంటకంపై సోషల్ మీడియా వేదికగా దేశీ ఫుడ్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియోలో రామ్సే టమాటా సాస్‌తో బటర్ చికెన్‌ను తయారుచేయడం కనిపిస్తుంది. బటర్ చికెన్ రెసిపీల్లో చికెన్ సాస్ వాడటం అరుదు కావడంతో ఈ ప్రయోగం నెటిజన్లకు అంతగా నచ్చలేదు.
ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ దక్కినా ఈ డిష్‌లో ఊహించని పదార్ధాలను జోడించడం దేశీ నెటిజన్లను నిరాశపరిచింది. అసలు టమాటా సాస్, నిమ్మకాయ ఈ రెసిపీకి ప్రామాణికమైన రుచిని ఎలా ఇస్తాయని పలువురు యూజర్లు ప్రశ్నించారు.
Read More :