ముత్యపు మెరుపులా ఎనామిల్ సొగసూ ఇట్టే ఆకట్టుకుంటుంది. అదనపు హంగుల కోసం ఆభరణాలకు ఎనామిల్ వాడటం అన్నది ప్రాచీన కాలం నుంచీ ఉన్నదే. ఏనుగు దంతాలు, పులులు, సింహాల వంటి జంతువుల గోళ్లను ఆభరణాలకు జోడించడానికి ఇదో కారణం. ఎనామిల్ నగలను ఈజిప్టు తవ్వకాల్లోనూ గుర్తించారు. ఉష్ణోగ్రతను బట్టి ఎనామిల్ రంగు మారుతుంది.
బంగారం, వెండి రేకులపై కావలసిన ఆకృతిలో.. కృత్రిమంగా తయారుచేసిన ఎనామిల్‌ను అద్దుతారు. మీనాకారి, జర్దోసీ నగలలో ఎనామిల్ మెరుపులు ఎక్కువే! ఈ ఆభరణాల తయారీలో లోహాలను తక్కువగా ఉపయోగిస్తారు. అందుకే తేలికగా, సౌకర్యంగా ఉంటాయి. అన్నిరకాల దుస్తులకూ నప్పుతాయి. అభిరుచిని బట్టి రాధామాధవులు, పక్షులు, జంతువులతోపాటు రంగవల్లులను కూర్చిన ఆభరణాలను ఎంచుకోవచ్చు. ఒకే డిజైన్‌తో ఉంగరాలు, గాజులు, గొలుసులు, జుంకాలతో కూడిన కాంబోలూ వచ్చేశాయి. ఆలస్య మెందుకు.. ప్రయత్నించండి.