e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Intercourse Stamina: ఇవి తిన్నారంటే ఆ ప‌నిలో దూసుకెళ్ల‌డం ఖాయం..!

Intercourse Stamina: ఇవి తిన్నారంటే ఆ ప‌నిలో దూసుకెళ్ల‌డం ఖాయం..!

Intercourse Stamina: శృంగారం ఒక‌ అద్భుత కార్యం. అద్భుత కార్యం మాత్ర‌మే కాదు, అద్భుత‌మైన కావ్యం కూడా. ఈ కావ్యంలో లెక్క‌లేన‌న్ని పేజీలు. ఆ పేజీల‌న్నింటినీ చ‌దివి ఆస్వాదించ‌డానికి జీవిత‌కాలం స‌రిపోదు. ఒక్కో పేజీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎంత చ‌దివినా ఇంకా కొత్త‌గానే అనిపించ‌డం ఒక‌ శృంగార కావ్యంలోనే ఉంటుంది. శృంగారం ఒక మ‌హ‌త్త‌ర‌మైన క్రీడ కూడా. అయితే, ఈ క్రీడ‌పై ఉండే ఆశకు, ఆరాటానికి మించి అవగాహన చాలా ముఖ్యం. ఈ క్రీడ‌లో ఎంత తొంద‌ర‌ప‌డితే అంత త్వ‌ర‌గా బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయం.

అందుకే సమరంలో కంటే సరసంలో సహనం చాలా ముఖ్య‌మ‌ని వాత్సాయనుడు చెప్పాడు. అందుకే శృంగారంలో తొందరపాటు అంత మంచిది కాదు. మ‌రి శృంగారంలో తొంద‌ర‌ప‌డ‌కూడదంటే చాలా స‌హ‌నం ఉండాలి. అందుకు ధృడ‌మైన మ‌న‌స్త‌త్వం కావాలి. ఇవి ప్ర‌య‌త్నిస్తే ఎవ‌రికైనా సాధ‌న‌తో సాధ్య‌ప‌డేవే. అయితే, వీటికి తోడు శారీర‌క ప‌టుత్వం కూడా శృంగారానికి చాలా అవ‌స‌రం. కొన్ని ఆహార ప‌దార్థాల‌కు ఈ శారీర‌క ప‌టుత్వాన్ని పెంచే సామర్థ్యం ఉన్న‌ది. మ‌రి ఆ పదార్థాలేమిటో తెలుసుకుందామా..?

శృంగార సామ‌ర్థ్యం పెంచే ప‌దార్థాలు..

7 Cancer-Fighting Culinary Spices and Herbs - Nepali Headlines,Nepal News,  Nepali News, News Nepal
- Advertisement -

అల్లం: సాధార‌ణంగా అల్లం టీ తాగితే శరీరంలో ఒక కొత్త శ‌క్తి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అందుకే వంటల్లో అల్లం ఉప‌యోగిస్తుంటారు. ఈ అల్లంవ‌ల్ల ఆరోగ్యం మాత్ర‌మే కాదు వంట‌కు రుచి కూడా వ‌స్తుంది. అంతేకాదు ప‌డ‌క గ‌దిలో మ‌గాడి ప‌టిమ‌ను కూడా ఈ అల్లం టీ పెంచుతుంద‌ట‌. రోజూ చెంచాడు అల్లం రసం తీసుకుంటే వీర్య వృద్ధి కూడా జ‌రిగి, సంతానలేమీ సమస్యలు కూడా తొల‌గిపోతాయ‌ట‌.

ఇంగువ-బెల్లం: ప్ర‌తిరోజూ ఇంగువతోపాటు బెల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల మ‌గ‌త‌నం బ‌ల‌ప‌డుతుంద‌ట‌. శృంగార సమస్యలతోపాటు ఇత‌ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయట‌. ఇంగువలో ఉండే పోషకాలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతాయ‌ట‌. బెల్లం మాత్రం ఆడ, మగ ఇద్దరిలోనూ లైంగిక సాఫ‌ల్య‌త‌కు తోడ్ప‌డుతుంద‌ట‌.

వెల్లుల్లి: వెల్లుల్లిలో కూడా శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ల‌క్ష‌ణం ఉంద‌ట‌. శృంగారంలో ఊరికెనే తేలిపోయే పురుష పుంగ‌వుల‌కు ఈ వెల్లుల్లి దివ్య‌మైన ఔష‌ధంలా ప‌నిచేస్తుంద‌ట‌. నిత్యం వంటల్లో వాడ‌టంతోపాటు అప్పుడ‌ప్పుడు పచ్చి వెల్లుల్లి రెబ్బ‌లు కూడా తినడంవల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందట‌. సంతాన లేమి సమస్యలు కూడా తొలగిపోతాయట‌.

7 Facts No one Will Tell You About The Purple Garlic

మునక్కాయలు: మునక్కాయలు తింటే మ‌గాడిలో మ‌గ‌సిరి మీసం మెలేస్తుంద‌నేది అక్షరసత్యం. మునక్కాయల్లో ఉండే జింక్ లైంగిక సామర్థ్యం పెరుగ‌డంలో తోడ్ప‌డుతుంద‌ట‌. అదేవిధంగా మున‌క్కాయ‌ల్లో కాల్షియం, ఐరన్ కూడా ఉండటంవల్ల ఎముకల ధృడ‌త్వానికి తోడ్ప‌డుతుంద‌ట‌. అందుకే చిన్నపిల్లలతోపాటు గర్భిణిలకు కూడా మున‌క్కాయ‌లు ఆహారంగా ఇస్తే మంచిద‌ట‌.

సోంపు: సోంపును సాధార‌ణంగా జీర్ణ‌శ‌క్తిని పెంచుకోవ‌డం కోసం ఉప‌యోగిస్తుంటాం. అందుకే భోజనం చేసిన త‌ర్వాత‌ నోట్లో సోంపు వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే, జీర్ణ‌శ‌క్తిని పెంచే ఈ సోంపే శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందట‌. రోజుకి రెండు సార్లు చెంచాడు సోంపు నోట్లో వేసుకుంటే చాలు లైంగిక సామర్థ్యం పెరుగుతుందట‌. అంగస్థంభన సమస్య ఉన్నా కూడా క్ర‌మంగా తొలిగిపోతుందట‌.

ఇవి కూడా చదవండి

Smart Card | గుడ్ న్యూస్‌: ఆన్‌లైన్‌లో రైల్వే స్మార్ట్‌కార్డు రీచార్జ్‌

Smart Phone offer: ఎస్బీఐ కార్డుతో కొంటే ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

Photoshoot : ఫోజుకు సిగ్గుప‌డి వ‌రుడిని కొల‌నులోకి తోసిన వ‌ధువు.. వైర‌ల్ వీడియో

Bumper offer : బైకు కొంటే హెల్మెట్ ఫ్రీ.. ఈ బంపర్ ఆఫ‌ర్ ఎక్క‌డో తెలుసా..!

మ‌న‌వ‌డితో క‌లిసి బామ్మ నాగినీ డ్యాన్స్‌.. వైర‌ల్ వీడియో

Video viral : ఓ యువ‌జంట బ‌రితెగింపు.. రన్నింగ్‌ బైక్‌పైనే రొమాన్స్‌..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana