అజీర్తితో అవస్థపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Health Tips |
మనం సాధారణంగా ఎదుర్కొనే కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు వంటింట్లోనే చక్కని పరిష్కారం దొరుకుతుంది. నిత్యం వంటల్లో ఉపయోగించే జీలకర్ర, మెంతులు, పసుపు, ఇలాచ్చి, లవంగం, అల్లం, వెల్లుల్లి లాంటి వాటిని వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంటాం. అందులో అజీర్తి సమస్యకు మెంతులు చక్కని పరిష్కారం చూపుతాయి. వంటల్లో సువాసన కోసం మాత్రమే కాదు, ఒంట్లో ఆరోగ్యం కోసం ఇవి బాగా పనిచేస్తాయి. మెంతులను వివిధ రకాలుగా తీసుకోవడం ద్వారా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?
1. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.
2. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరం సమస్యలను కూడా మెంతులు తగ్గిస్తాయి. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున ఆ నీళ్లను తాగాలి. దాంతో అజీర్తి సమస్య తొలగిపోతుంది.
3. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దాంతో మనం మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఆహారం మితంగా తీసుకోవడంవల్ల ఒంట్లో కొవ్వు కరుగుతుంది. కాబట్టి స్థూలకాయులకు కూడా మెంతులు నిత్యావసరం.
4. మెంతి గింజలను పెనం మీద వేయించి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ పొడిని కూరల్లో కూడా వాడుకోవచ్చు.
5. ఒక చెంచా మెంతులను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడంవల్ల కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు తోడ్పడుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

