Shampoo rocks | ఈ వజ్రాలు, రత్నాలతో ఎంచక్కా స్నానం చేయవచ్చు
Shampoo rocks | షాంపూ అంటే డబ్బాలోనో, షాచేలోనో ఉండే ద్రవ పదార్థంగానే మనకు తెలుసు. సబ్బులు అనగానే గుండ్రంగానో, చతురస్రంగానో ఉంటాయనే అనుకుంటాం. కానీ అచ్చం గులక రాళ్లలా కనిపించే ఘనరూప షాంపూలు ఇప్పుడు తయారవుతున్నాయి.
Shampoo rocks | షాంపూ అంటే డబ్బాలోనో, షాచేలోనో ఉండే ద్రవ పదార్థంగానే మనకు తెలుసు. సబ్బులు అనగానే గుండ్రంగానో, చతురస్రంగానో ఉంటాయనే అనుకుంటాం. కానీ అచ్చం గులక రాళ్లలా కనిపించే ఘనరూప షాంపూలు ఇప్పుడు తయారవుతున్నాయి. వజ్రాలు, రత్నాలను పోలిన సబ్బులు ట్రెండవుతున్నాయి. అంతేకాదు, రాళ్లను తలపించే కండిషనర్లు, గుళికల్లాంటి టూత్‌పేస్టులు మార్కెట్లో దొరుకుతున్నాయి.
హేమ వాళ్లింటికి వచ్చిన నీలిమ నిద్రలేవగానే బాత్రూమ్ వైపు వెళ్లి పేస్టు కోసం వెతకసాగింది. ఇంతలో నల్లటి రాతి ముక్కలాంటిదాన్ని చేతిలో పెట్టి ‘ఇదిగో పేస్టు’ అంది హేమ. వింతగా చూస్తున్న నీలిమతో ‘దీన్ని ఇలా నోట్లో వేసుకుని నమిలి, అప్పుడే కడిగిన బ్రష్‌తో పళ్లు తోముకోవడమే’ అంది హేమ. ఇక స్నానానికంటూ కెంపును పోలిన ఓ రాయిని ఇచ్చింది. అంతేకాదు, ‘తలస్నానానికి షాంపూ కావాలి కదూ!’ అంటూ రెండు గుళకరాళ్లను తెచ్చి బాత్రూం షెల్ఫ్ మీద ఉంచింది. ‘ఇదిగో కండిషనర్’ అంటూ… మరో రెండు తెల్లటి మార్బుల్స్ లాంటివి పక్కన ఉంచింది. ఇవన్నీ చూసిన నీలిమ… ‘ఏంటే.. ఈ వేళాకోళం. రాళ్లతో స్నానం చేయమంటావా…’ అంది కాస్త కోపంగా. ‘అయ్యో… అవేం రాళ్లు కాదే, నిజంగా సబ్బూ, షాంపూ, కండిషనర్లే. ఇదిగో ఇలా నీళ్లలో తడిపి చూడు ఎంత నురగ వస్తుందో’ అంది హేమ. అవును, ఇక్కడ హేమ చెప్పిన ప్రతి మాటా నిజమే! ఇప్పుడు బాత్రూం కాస్మెటిక్స్‌లో నడుస్తున్నది రాళ్ల ట్రెండే మరి.
మిన‘రాళ్లు’
ఈ రకం సబ్బులను జెమ్‌స్టోన్ రాక్ సోప్‌లు, క్రిస్టల్ సోప్లుగా పిలుస్తున్నారు. పచ్చ, కెంపు, నీలం, ఓపల్, అమెథిస్ట్, టర్కోయిస్లాంటి రకరకాల రాళ్లను పోలి ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు. గ్లిజరిన్, లావెండర్, జోజోబా, ఆలివ్ ఆయిల్లాంటి వాటితోపాటు మినరల్స్ కలిగిన మట్టిని వీటి తయారీలో వాడతారు. అమెరికా గ్రాండ్ కాన్యన్ నుంచి, జపాన్‌లోని వేడినీటి బుగ్గల దగ్గర నుంచి, హవాయిలోని అగ్నిపర్వత లావా ప్రాంతం నుంచీ… ఇలా విభిన్న ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో వివిధ రకాల షాంపూ రాళ్లను రూపొందిస్తున్నారు. అదనంగా, జుట్టు ఆరోగ్యానికి పనికొచ్చే ఎసెన్షియల్ ఆయిళ్లు, విటమిన్లనూ జోడిస్తున్నారు. కొబ్బరిపాలలాంటివి కలిపి కండిషనర్లని తయారు చేస్తున్నారు. వీటిని జీరోవేస్ట్ హెయిర్ రాక్ షాంపూ, కండిషనర్లుగా పిలుస్తున్నారు. వీటితోపాటు ఫ్లోరైడ్ అసలు లేకుండా, రంగులు కానీ, నిల్వ ఉంచడానికి రసాయనాలు కానీ కలపనవసరం లేకుండా టూత్‌పేస్ట్‌కి బదులు టూత్‌పేస్ట్ ట్యాబ్లెట్లు, మౌత్‌వాష్ ట్యాబ్లెట్లూ వస్తున్నాయి. షాంపూ, కండిషనర్, టూత్‌పేస్ట్, మౌత్వాష్లాంటివన్నీ ద్రవాల రూపంలో కాకుండా ఇలా ఘనరూపంలో రావడం వల్ల ఊళ్లకు వెళ్లినప్పుడు సులభంగా తీసుకెళ్లొచ్చు. వీటిలో వృథా కూడా చాలా తక్కువ. మొత్తానికి ఇప్పుడు మనం ఫ్రెషప్ అవ్వడానికి వాడే ఉత్పత్తులన్నీ ‘ఘన’మై పోతున్నాయన్నమాట!
Read More :
“velvet fashion | డ్రెస్ అయినా, ప్యాంట్ అయినా… ట్రెండు మాత్రం వెల్వెట్దే!”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- shampoo
- shampoo rocks
- trend
- variety
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

