నిజం చెప్పలేకపోతున్నా..
ఇంజినీరింగ్ తర్వాత ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఓ సహోద్యోగి బాగా నచ్చాడు. అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడని అర్థమైంది. ఓ రోజు తనే ప్రపోజ్ చేశాడు. నేను వెంటనే ఓకే చెప్పలేదు. నా సీనియర్‌ను అడిగితే.
ఇంజినీరింగ్ తర్వాత ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఓ సహోద్యోగి బాగా నచ్చాడు. అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడని అర్థమైంది. ఓ రోజు తనే ప్రపోజ్ చేశాడు. నేను వెంటనే ఓకే చెప్పలేదు. నా సీనియర్‌ను అడిగితే.. ‘అతనితో కొంచెం జాగ్రత్త’ అని హెచ్చరించింది. మొదట్లో నాకెందుకో మంచి వాడనే అనిపించింది. మధ్యేమార్గంగా డేటింగ్లో ఉందామని అన్నాను. సినిమాలకెళ్లాం. షికార్లు చేశాం. కానీ, శారీరకంగా ఎలాంటి తప్పూ చేయలేదు. నా జాగ్రత్తలో నేనున్నాను.
ఏడాదిన్నరలో అతని నిజ స్వరూపం బయటపడింది. విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. అతనికి కనీస మర్యాదలు లేవు. ఏ విషయంపైనా స్పష్టత లేదు. రోజూ మందు తాగాల్సిందే. పార్టీల పేరుతో అమ్మాయిలతో తిరుగుతున్నాడు. అతని మిత్రబృందమూ సరైంది కాదు. మూణ్నెల్ల క్రితమే విడిపోదామని నిశ్చయించుకున్నా. ఆ విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతాడోననే భయంతో ఆగిపోయాను. ఏదో అపరాధ భావం వెంటాడుతున్నది. ఆఫీసులో పని చేసుకోలేక పోతున్నాను. అతనికి, ఉద్యోగానికి మధ్య నలిగిపోతున్నా. దయచేసి సలహా ఇవ్వగలరు.
– ఓ సోదరి
డేటింగ్ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ ట్రెండ్ వల్ల ఒకే ఒక్క ఉపయోగం.. ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవడం. పెండ్లికి ముందే అతని గురించి పూర్తిగా తెలిసింది కాబట్టి, నువ్వే తుది నిర్ణయం తీసుకోవాలి. మొదట్లో మంచివాడిలా నటించాడు. ఇప్పుడు నిజస్వరూపం తెలిసిపోయింది. అనుభవిస్తున్న బాధలు చాలు. అతనితో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలు సేకరించుకోండి. ఆ తర్వాత అతని మూడ్‌ను బట్టి.. మీ భావోద్వేగాలను వివరించండి, మెల్లిగా ఒప్పించే ప్రయత్నం చేయండి. వినకపోతే.. మెయిల్ ద్వారా, మెసేజ్‌ల ద్వారా, వాయిస్ మెసేజ్‌ల ద్వారా అదే విషయాన్ని పదే పదే చెప్పండి. తన వాదన కూడా ఓపిగ్గా వినండి. ఆ మాటల్లో నిజాయతీ ఉంటే.. మారే అవకాశం ఉందనిపిస్తే.. ఇంకో చాన్స్ ఇవ్వండి. లేకపోతే సహోద్యోగులుగానో, స్నేహితులుగానో ఉండిపోదామని చెప్పండి. వీలైనంత త్వరగా.. ఉద్యోగం మారండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. తాత్కాలిక బంధాలతో జీవితాలను నాశనం చేసుకున్నవారే అధికం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- dating
- fashionable
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

