ఆర్థిక స్థిరత్వమే మేలు!
ఒక వ్యక్తి వేసుకునే దుస్తులు, తాను వాడే వాహనాలను చూసి వారి ఆర్థిక స్తోమతను అంచనా వేయడం నేటి సమాజంలో సర్వసాధారణం. అయితే బయటికి కనిపించే ఆడంబరాల కంటే భవిష్యత్తు కోసం చేసే పొదుపే అసలైన సంపద అని చాటిచెప్పే ఓ ఆసక్తికర సంఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. అభిషేక్‌సింగ్ అనే యువకుడు 22 ఏండ్ల వయసులో హిటాచీ కంపెనీలో తొలి ఉద్యోగంలో చేరాడు.
ఒక వ్యక్తి వేసుకునే దుస్తులు, తాను వాడే వాహనాలను చూసి వారి ఆర్థిక స్తోమతను అంచనా వేయడం నేటి సమాజంలో సర్వసాధారణం. అయితే బయటికి కనిపించే ఆడంబరాల కంటే భవిష్యత్తు కోసం చేసే పొదుపే అసలైన సంపద అని చాటిచెప్పే ఓ ఆసక్తికర సంఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. అభిషేక్‌సింగ్ అనే యువకుడు 22 ఏండ్ల వయసులో హిటాచీ కంపెనీలో తొలి ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో తమ కార్యాలయంలో పనిచేసే మహిళా మేనేజర్ ప్రతిరోజూ 12 ఏండ్లకు పైగా పాతదైన బూడిద రంగు సాంత్రో కారులో ఆఫీసుకు వచ్చేవారట.
ఆ కారు సస్పెన్షన్ సమస్య వల్ల స్టార్ట్ చేసినప్పుడు ఒక వింత శబ్దం వచ్చేదట. ప్రతిరోజూ సాయంత్రం ఆ కారు శబ్దం వినబడగానే ‘ఈ పాత కారును ఎప్పుడు పారేస్తుందో’ అంటూ ఆఫీసులోని ఉద్యోగులంతా నవ్వుకునేవారట కూడా. తనతో సహా ఉద్యోగులంతా ఆమెను పిసినారిగా జమకట్టేవారని, ‘కానీ అసలు జోక్ మాపైనే పడిందని కొన్నేండ్ల తర్వాత అర్థమైంది’ అంటూ అభిషేక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఆ మేనేజర్ కేవలం 46 ఏండ్ల వయసులోనే ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించారని తెలిసి ఆయన ఆశ్చర్యపోయాడట.
ఆడంబరాల కోసం డబ్బు దండగ చేయకుండా, కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం వల్లే ఆమె అంత చిన్న వయసులోనే ఆర్థిక స్వాతంత్య్రం సాధించారు. ‘ఎవరైనా బయటికి ఏం చూపిస్తున్నారనే దానికంటే.. వారు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారనేదే ముఖ్యం. ఆ సంఘటన తర్వాత కారును చూసి మనుషులను అంచనా వేయడం మానేశాను’ అని అభిషేక్ వెల్లడించాడు.
ఆయన పంచుకున్న ఈ అనుభవం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను కూడా 16 ఏండ్లుగా ఒకే కారు వాడుతున్నాను, ప్రస్తుతం నా వయసు 50 ఏండ్లు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘కొంచెం మంచి కారు కొనుకుని 48 ఏండ్లకు రిటైర్ అయినా జీవితాన్ని ఆస్వాదించవచ్చు కదా’ అని మరొకరు భిన్నంగా స్పందించారు. ‘జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అనడమే వారి పని’ అనే ప్రముఖ హిందీ సామెతను మరికొందరు గుర్తుచేసుకున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

