సద్దుల్లో ఎన్ని సుద్దులో
బతుకమ్మ పాటల్లో ఆడబిడ్డల ఆకాంక్షలు ఎట్లయితే వ్యక్తమయితున్నయో సద్దుల్లోనూ మంచి జరగాలనే తలపే ఉంది. కాలానుగుణంగా పండే ధాన్యం, పండ్లు తినాలని ఇప్పుడు డైటీషియన్లు చెబుతున్నరు కదా! అట్లనే ఏనాడో మన ఆడబిడ్డలు కాలానుగుణంగా పండే ధాన్యాన్ని తింటూ ఆరోగ్యంగా ఉన్నరు. బిడ్డల బతుకు కోరుతూ అమ్మలు ఆడుకునే బతుకమ్మ ఆట అయిపోయినంక పంచుకునే ప్రసాదాల్లోనూ ఓ సామాజిక సందేశం ఉంది.
బతుకమ్మ పాటల్లో ఆడబిడ్డల ఆకాంక్షలు ఎట్లయితే వ్యక్తమయితున్నయో సద్దుల్లోనూ మంచి జరగాలనే తలపే ఉంది. కాలానుగుణంగా పండే ధాన్యం, పండ్లు తినాలని ఇప్పుడు డైటీషియన్లు చెబుతున్నరు కదా! అట్లనే ఏనాడో మన ఆడబిడ్డలు కాలానుగుణంగా పండే ధాన్యాన్ని తింటూ ఆరోగ్యంగా ఉన్నరు. బిడ్డల బతుకు కోరుతూ అమ్మలు ఆడుకునే బతుకమ్మ ఆట అయిపోయినంక పంచుకునే ప్రసాదాల్లోనూ ఓ సామాజిక సందేశం ఉంది. బతుకమ్మ ఆడే కాలానికి నువ్వుల పంట, పెసలు ఇంటికి వస్తయి. నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందులో నూనె కూడా ఉంటుంది. క్యాల్షియం శరీరం గ్రహించాలంటే నూనె కూడా తోడవ్వాలి.
ఆధునిక పరిశోధనలు నిర్ధారించిన ఈ సత్యం బతుకమ్మ సద్దుల్లో ఉందని సామాజిక పరిశోధకులు గుర్తించారు. పెసర్లలో కూడా క్యాల్షియం, ప్రొటీన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. మహిళల శరీర ఎదుగుదలకు కావాల్సినవి ప్రొటీన్, క్యాల్షియం. ఈ రెండిటినీ ప్రసాదాల్లో చేర్చుకుని ఆహార సంస్కృతిని చాటుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ ఆట కోసం నువ్వులు, పెసర్లతో లడ్డూలు తయారు చేస్తారు. కానీ, వాటిని ఆ ఒక్కరోజే తినరు. ఆ రోజు వండుకున్న వంటలు ఆ తర్వాత రోజుల్లోనూ ఆరగిస్తూ ఆరోగ్యంగా ఉంటారు. పులిహోర, కొబ్బరి అన్నం, బెల్లంతో అన్నం తయారు చేస్తారు. ఇవన్నీ పోషకాల సమాహారాలే. ఈ బతుకమ్మ ప్రసాదాల్లో ప్రాంతానికో ప్రత్యేకత కూడా ఉంటుంది.
మెదక్ ప్రాంతంలో జొన్న రొట్టెలు చేసి, వాటిని దంచుతారు. వాటిలో బెల్లం పొడిని కలిపి మలీద ముద్దలు తయారు చేసుకుంటారు. బతుకమ్మ పాటల్లో కడుపుతో ఉన్న ఓ కోడలు ‘అత్తరో ఓ అత్త మలీద ముద్దలు మీద మనసాయె అత్త… నేనెరుగ నేనెరుగ నీ మామనడుగు … మామరో ఓ మామ మలీద ముద్దల మీద మనసాయె మామ… నేనెరుగు నేనెరుగ నీ అక్కనడుగు’ అంటూ పాడుకుంటూ బతుకమ్మ ఆడుకుంటారు. బహుశా ఇది మెదక్ ఆడబిడ్డలు కైగట్టినదై ఉంటుందని బతుకమ్మ పాటలపై పరిశోధన చేసిన సామాజిక పరిశోధకురాలు తిరునగరి దేవకీదేవి చెబుతున్నారు. పువ్వులు, ప్రసాదాలు, పాటలు అన్నీ బతుకు కోరేవే. ఆడబిడ్డల ఆకాంక్షలే అనేందుకు ఇదో చిన్న ఉదాహరణ.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

