క్రిస్మస్ మస్త్!
పండగ వచ్చిందంటే పిల్లల హడావుడి మామూలుగా ఉండదు. కొత్త డ్రెస్సులు, మ్యాచింగ్‌లు అంటూ తెగ సందడి చేస్తారు.
పండగ వచ్చిందంటే పిల్లల హడావుడి మామూలుగా ఉండదు. కొత్త డ్రెస్సులు, మ్యాచింగ్‌లు అంటూ తెగ సందడి చేస్తారు. చిన్నారులు చక్కగా ముస్తాబై ఇంట్లో కలియ తిరుగుతుంటే ముచ్చటగా ఉంటుంది. క్రిస్మస్ స్పెషల్‌గా చిన్నారుల కోసం డిజైన్ చేసిన ప్రత్యేక ఫ్రాక్ కలెక్షన్..
శాటిన్ మెరుపు..
స్కై బ్లూ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన వేవ్లుక్ ఫ్రాక్ ఇది. బాడీపార్ట్లో ఓపెన్ షోల్డర్ కట్ ఇచ్చి నెక్లైన్ డిజైన్ చేశారు. సేమ్కలర్ ఫ్యాబ్రిక్‌తో చిన్నచిన్న కట్పీసెస్ జతచేసి యూ కట్‌తో ఫినిషింగ్ ఇవ్వడం ైస్టెలిష్‌గా ఉంది. లెహంగా కోసం సేమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై సిల్వర్ కలర్ స్కోలప్ బోర్డర్‌తో సీక్వెన్స్ వర్క్‌తో హైలైట్ చేశారు. సేమ్ కలర్ శాటిన్‌తో లైనింగ్ ఇవ్వడంతో మరింత మెరుపు తోడయ్యింది. నైట్ పార్టీలకు చక్కని ఎంపిక.
ప్రింటెడ్ సొగసు..
బచ్చలపండు రంగు ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన స్పెషల్ ఫ్రాక్ ఇది. నిండు కలర్‌పై హైలైట్ అయ్యేలా సిల్వర్ కలర్ సీక్వెన్స్ వర్క్ చేశారు. బాడీపార్ట్లో త్రీడి లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. వన్‌సైడ్ షోల్డర్ ఇచ్చి గులాబీ అందాన్ని జోడించారు. బాటమ్ కోసం ఫాలింగ్ సిల్క్‌తో ప్రిల్స్ ఇచ్చి బార్డర్లో వైరింగ్ చేయడంతో వేవ్లుక్ వచ్చింది. ైస్టెలిష్ లుక్ కోరుకునే పిల్లలకు సరైన ఎంపిక.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

