పువ్వులా మెత్తగా మెరిసే వస్త్రం శాటిన్. డ్రెస్ ఏదైనా క్లాస్లుక్ రావాలంటే శాటిన్ ఉండాల్సిందే. అన్ని రంగుల్లోనూ అదిరే అందం దీని సొంతం. ఇంద్రనీలాల సోయగాలను సంతరించుకుని ఇక్కడ బులుగు రంగులో మెరుస్తున్న మాడ్రన్ డ్రెస్సుదీ శాటిన్ కులమే. ఆపైన గులాబీ వన్నెలో నడుమును చుట్టిన మెరుపూ దాని చుట్టమే.
బో మాడల్లో దీన్ని అలంకరించి, కాంట్రాస్ట్ రంగును జోడించి అందంగా తీర్చిదిద్దారిక్కడ. ప్రఖ్యాత నగల తయారీ సంస్థ కార్టియర్ జాతిరత్నాలను పొదిగిన నెక్లెస్ కృతి సనన్ ఆహార్యానికి అల్ట్రా మాడ్రన్ లుక్ తీసుకొచ్చింది.