వంటింట్లో చేతితో పూర్తి చేయాల్సిన పనులే కాదు, గోళ్లతో చక్కబెట్టాల్సిన వ్యవహారాలూ చాలానే ఉంటాయి. ముఖ్యంగా గోంగూర తెంపడం, గోరు చిక్కుళ్లు, వెల్లుల్లి పాయలు ఒలవడం లాంటివాటికి పదునైన గోళ్లు చాలా అవసరం. అయితే, ఎక్కువ మొత్తంలో తెంపాల్సి వచ్చినప్పుడు గోళ్లు సరిగ్గా లేకపోతే వేగం మందగిస్తుంది. ఆ పనిని సులభతరం చేసేలా మార్కెట్లోకి వచ్చిందే ‘సిలికాన్ థంబ్ నైఫ్ సెట్’. ఇందులో సిలికాన్తో చేసిన బొటనవేలి తొడుగుకు పదునైన గోరులాంటి స్టీలు అమరిక ఉంటుంది. చూపుడు వేలుకు తొడుగు వస్తుంది. గోరు ఎలా పనిచేస్తుందో అలానే దీంతో పనులు చేసుకోవచ్చు. వేగంగా, తక్కువ శ్రమతో పూర్తి చేయొచ్చు.