ఫోన్ చూస్తే.. లక్ష్యం పోయినట్లే!
మార్నింగ్ వాక్.. మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకే, ఉదయపు నడక మంచి అలవాటుగా గుర్తింపు పొందింది. కానీ, ఈ సమయంలో చేసే ఓ చిన్న పొరపాటు.. మార్నింగ్ వాక్ లక్ష్యాన్నే నీరుగారుస్తున్నది.
మార్నింగ్ వాక్.. మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకే, ఉదయపు నడక మంచి అలవాటుగా గుర్తింపు పొందింది. కానీ, ఈ సమయంలో చేసే ఓ చిన్న పొరపాటు.. మార్నింగ్ వాక్ లక్ష్యాన్నే నీరుగారుస్తున్నది. ఫోన్ చూస్తూ నడవడం వల్ల.. నడక ప్రయోజనాలు అందకపోగా, కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతున్నది.
ఈకాలంలో ఎన్నో పనులను ఫోన్లోనే చక్కబెట్టుకుంటున్నారు. అయితే, చాలామంది వాటన్నిటినీ మార్నింగ్ వాక్‌లోనే కానిచ్చేస్తుంటారు. చాటింగ్ చేస్తూనో.. కాల్ మాట్లాడుతూనో ఉదయపు నడక సాగిస్తుంటారు. దీనివల్ల మార్నింగ్ వాక్ వల్ల కలిగే ప్రయోజనాలు పక్కదారి పడతాయని నిపుణులు చెబుతున్నారు. పైగా లేనిపోని ఆరోగ్య సమస్యలు పలకరిస్తాయని హెచ్చరిస్తున్నారు.
- మెడను ఒక పక్కకు వంచి.. ఫోన్లో మాట్లాడుతూ నడవడం వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి. వాకింగ్‌లో శరీర సమతుల్యత తప్పుతుంది. దీనివల్ల నడుము, మెడ, భుజాల కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్యానికి కారణం అవుతుంది.
- ఒకే ధ్యాసతో, లయబద్ధంగా నడిచినప్పుడే.. గుండెకు, ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ నడవడం వల్ల శ్వాస తీసుకోవడంలో మార్పులు వస్తాయి. దాంతో, గుండె స్పందనల రేటు ఆశించిన స్థాయిలో క్రమబద్ధంగా ఉండదు.
- ఫోన్ చూస్తూ నడవడం వల్ల.. తెలియకుండానే నడక వేగం తగ్గుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరగదు. ఫలితంగా కార్డియో వ్యాయామం ద్వారా అందాల్సిన పూర్తి ఫిట్నెస్ ప్రయోజనాలు, కేలరీలు కరగడం వంటివి అందవు.
- ఉదయపు నడకలో వెన్నెముక నిటారుగా ఉండాలి. చేతులు ఊపుతూ నడవాలి. అప్పుడే శరీరానికి మంచి స్ట్రెచ్చింగ్ లభిస్తుంది. అయితే, తల దించుకుని ఫోన్ చూడటం వల్ల.. మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దాంతో, రోజంతా అలసటగా, నొప్పులతో గడపాల్సి వస్తుంది.
- నడుస్తూ ఫోన్ స్క్రీన్ వైపు చూడటం, మెసేజ్‌లు చదవడం, టైప్ చేయడం, రీల్స్ చూడటం వల్ల.. కంటి కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది తలనొప్పికి కూడా దారితీస్తుంది.
- రాత్రంతా పడుకుని లేచాక.. ఉదయాన్నే మన మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తే.. మానసికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అలాకాకుండా.. ఫోన్ స్క్రీన్‌పై వచ్చే నోటిఫికేషన్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా రీల్స్ చూడటం వల్ల.. మెదడు డిజిటల్ అలసటకు గురవుతుంది. ఉదయాన్నే ఒత్తిడి, ఆందోళన మొదలవుతాయి.
.. అందుకే, మార్నింగ్ వాక్‌ను కేవలం శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే అంకితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లో చక్కబెట్టుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే.. వాటికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలని అంటున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

