తెలంగాణ ఆస్తిని కాపాడేది బీఆరెస్సే
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆస్తిని కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల ప్రజలు ఆశీర్వదించి ఒకటో నెంబర్ కారు గుర్తుపై ఓటు గుద్దితే ఢిల్లీలో దద్దరిల్లాలని అన్నారు.
- మీ బిడ్డగా అభిమానంతో కారు గుర్తుపై ఓటు వేయాలి
- కాంగ్రెస్‌కు చివరి వరకు అభ్యర్థి దొరకని పరిస్థితి
- వీ.ఎం.బంజర రింగ్ సెంటర్ రోడ్ షోలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
- మోసం చేసింది కాంగ్రెస్ : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
- సమ న్యాయం చేసింది కేసీఆరే.. : సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర
పెనుబల్లి, మే 8 : తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆస్తిని కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల ప్రజలు ఆశీర్వదించి ఒకటో నెంబర్ కారు గుర్తుపై ఓటు గుద్దితే ఢిల్లీలో దద్దరిల్లాలని అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోకు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోమారు మీ బిడ్డపై అభిమానం చూపి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. నేను స్థానికుడిని.. మీ బిడ్డను.. నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా మన ప్రియతమ నేత కేసీఆర్ ముందుగానే ప్రకటించారని, కానీ.. కాంగ్రెసోళ్లు బయటి వ్యక్తిని తీసుకొచ్చి నామినేషన్ వేయించారని, వారికి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. భవిష్యత్‌లో దేశ రాజకీయాల్లో తెలంగాణ ఎంపీలు కీలకమన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఈ నెల 13న ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మోసం చేసింది కాంగ్రెస్ : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
అన్ని వర్గాలకు అండగా నిలిచింది గత కేసీఆర్ ప్రభుత్వమని, కానీ.. అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని, ఆయనకు అండగా నిలబడాలంటే ఈ నెల 13న జరిగే ఓటింగ్‌లో కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
సమ న్యాయం చేసింది కేసీఆరే.. : మాజీ ఎమ్మెల్యే సండ్ర
మాయమాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సమ న్యాయం చేసింది గత కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు లేకపోవడం శోచనీయమన్నారు. కాగా.. రోడ్ షోకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, నాయకులు కోటగిరి సుధాకర్‌బాబు, లక్కినేని వినీల్, మండల ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, వంగా గిరిజాపతి, పసుమర్తి వెంకటేశ్వరరావు, చిలకా నీలాద్రిబాబు, దొడ్డపునేని రవి, మందడపు అశోక్‌కుమార్, ఎలమర్తి శ్రీను, తేళ్లూరి నాగేశ్వరరావు, తేజావత్ తావునాయక్, కాకా సీతారాములు, కొత్తగుండ్ల అప్పారావు, తడికమల్ల తాతారావు, మాగం రాఘవరావు, చింతనిప్పు సత్యనారాయణ, తాళ్లూరి శేఖర్‌రావు, నరుకుళ్ల సత్యనారాయణ, ఆవిటి మారేశ్వరరావు, మాగళ్ల నాగేశ్వరరావు, లగడపాటి శ్రీను, గోదా చెన్నారావు, ఏటుకూరి వెంకట అప్పారావు, సత్యనారాయణ, పరిమి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

