తెలుగు ఏడాది..ఉగాది
తెలుగు సంవత్సరానికి తొలి అడుగు.. వినసొంపైన కోయిల రాగం.. పచ్చనిచివుళ్లు తొడిగిన కొమ్మలు.. కొత్త ఆశలతో రైతుల ఏరువాక.. మంచి చెడులను తెలుసుకునే పంచాంగ శ్రవణం.. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పర్వదినం.. తెలుగు ప్రజల పండుగ ఇది.
- నేటి నుంచి శ్రీక్రోధి నామ సంవత్సరం ప్రారంభం
- కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం
- ఉగాది పచ్చడిలో జీవిత సందేశం
ఖమ్మం/ కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 8 : తెలుగు సంవత్సరానికి తొలి అడుగు.. వినసొంపైన కోయిల రాగం.. పచ్చనిచివుళ్లు తొడిగిన కొమ్మలు.. కొత్త ఆశలతో రైతుల ఏరువాక.. మంచి చెడులను తెలుసుకునే పంచాంగ శ్రవణం.. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పర్వదినం.. తెలుగు ప్రజల పండుగ ఇది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ముగిసి చైత్రబహుళ షష్టి మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ఉగాదిని కుటుంబ సభ్యులంతా ఘనంగా జరుపుకుంటారు. తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.
నూతన వస్ర్తాలు ధరిస్తారు. ఇళ్లను మామిడి, వేపాకు తోరణాలతో అలంకరిస్తారు. చాలామంది పండుగ నాడు కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన వస్ర్తాలు ధరించి ఉగాది పచ్చడి తయారుచేస్తారు. పొలాలకు వెళ్లి ఏరువాక ప్రారంభిస్తారు. గోవులను శుభ్రంగా కడిగి బొట్టుపెట్టి అందంగా అలంకరించడం ఆనవాయితీ. ఉగాది పచ్చడిని తయారు చేసి ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు.
షడ్రుచుల సమ్మేళనం..
జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు ఇలా ఆరు రుచులు కలిపి తయారు చేసే పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో జీవితంలో కూడా కష్టనష్టాలు, సుఖసంతోషాలు, ఐష్టెశ్వర్యాలు ఇలా అన్ని సమపాళ్లలో ఉంటే జీవితం కూడా సుఖమయంగా ఉంటుందనే నానుడి. తొడిమ లేని లేత వేపపూత, కొత్త బెల్లం, పిక్కతో ఉన్న చింతపండు, టెంకపట్టని మామిడి ముక్కలు, కొత్త కారం, రాళ్ల ఉప్పుతో ఉగాది పచ్చడి తయారుచేస్తారు. ఉగాది పచ్చడిలోని ఈ ఆరు పదార్థాల్లోని రుచులను మంచికి, చెడుకు, సంతోషానికి, బాధకు, దుఃఖానికి, సవాళ్లకు సంకేతాలుగా చెబుతుంటారు. ఇవి మనిషికి ఎల్లప్పుడు ఉంటాయి కాబట్టి జీవితాన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు.
ఉగాది పచ్చడిలో ఉండే ఆరోగ్య లక్షణాలు
వేపపువ్వు – రక్తాన్ని శుద్ధి చేస్తుంది
మామిడి – చర్మ సౌందర్యానికి దోహదం
బెల్లం – శరీర వేడిని తగ్గిస్తుంది
ఉప్పు – శక్తినిస్తుంది
చింతపండు – కాలేయ శుద్ధికి ఉపయోగం
మిర్చి – కఫం, వాత రోగాల నివారణ
పంచాంగ శ్రవణం ఉగాది రోజున అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ ఏడాది మొత్తం ఆదాయ వ్యయాలు, పంటలు, వర్షాలు, రాజపూజ్యం, అవమానం, రాశులు, నక్షత్రాల ఆధారంగా జాతకాలు చెబుతారు. ఇందుకోసం దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం ద్వారా సర్వ పాపహరణం జరుగుతుందని నమ్మకం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

