రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఖమ్మంజిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చింతకాని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కన్నెవీడుకు చెందిన కరిసే సుజాత- వెంకటరత్నం దంపతులు.
- నలుగురికి తీవ్రగాయాలు
- మృతులు కృష్ణా, సూర్యాపేట జిల్లావాసులు
- ఖమ్మంజిల్లాలో ఘటన
చింతకాని, జూలై 21 : ఖమ్మంజిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చింతకాని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కన్నెవీడుకు చెందిన కరిసే సుజాత- వెంకటరత్నం దంపతులు. సుజాతకు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆదివారం ఆసుప్రతి నుంచి డిస్చార్జి అయ్యారు. వీరితోపాటు సుజాతను చూడటానికి వచ్చిన ఆమె సమీప బంధువులు చెరుకుపల్లి హైమావతి- రాంబాబు దంపతులు, చావల శాంతమ్మతో కలిసి ఖమ్మానికి చెందిన ఓ ఆటోలో కన్నెవీడుకు బయలుదేరారు.
జగన్నాధపురం గ్రామం దాటిన తర్వాత మూలమలుపు వద్ద బోనకల్ నుంచి ఖమ్మంవైపు వస్తున్న కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరిసే వెంకటరత్నం(50), సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన చెరుకుపల్లి హైమావతి(45) మృతిచెందారు. సుజాత, రాంబాబు, శాంతమ్మ, ఆటోడ్రైవర్ ఎండీ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు వెంటనే చింతకాని పోలీసులు, 108కు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై షేక్ నాగుల్‌మీరా రక్తమోడుతున్న క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని వైరా సీఐ నునావత్ సాగర్ సైతం పరిశీలించారు. కారును అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఎస్సై నాగుల్‌మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

