డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు కదలాలని, మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి డ్రగ్స్ సోల్జర్స్‌గా మారాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు.
- భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం క్రైం : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు కదలాలని, మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి డ్రగ్స్ సోల్జర్స్‌గా మారాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, దివ్యాంగులతో కలిసి చేపట్టిన ర్యాలీలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ర్యాలీని ముందుగా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పోస్టాఫీస్ సెంటర్లో డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లా అతి పెద్దది అని, ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, వయోవృద్ధులు, యువత ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొనడం స్ఫూర్తి కలిగిస్తుందన్నారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పట్టణాలు, మండలాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వారం రోజులపాటు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించున్నట్లు తెలిపారు. అలాగే ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టనున్నట్లు చెప్పారు. మన దేహం ఉన్నది దేశం కోసమని, మాదక ద్రవ్యాలు సేవించి దేహాన్ని పాడు చేసుకోవద్దని, సమాజ బాగు కోసం ఎంతో కొంత చేస్తే సార్థకత ఉంటుందన్నారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడు తూ మత్తు పదార్థాల రవాణాదారులు, విక్రయదారులు, వినియోగదారులపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ర్టాల సరిహద్దున గల మన జిల్లా మీదుగా జరుగుతున్న గంజాయి రవాణాను సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. గడిచిన ఆరు నెలల్లోనే 5,000 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 30వేల కేజీలకు పైగా గంజాయిని తగులబెట్టినట్లు తెలిపారు. గంజాయి రవాణాను నిరోధించడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రెహమాన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, జిల్లా సంక్షేమాధికారి విజేత, మున్సిపల్ కమిషనర్ స్వామి, ఇంటర్మీడియట్ ఆఫీసర్ సులోచనారాణి, జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, దివ్యాంగులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

