కౌంటింగ్ హాళ్ల వద్ద మూడంచెల భద్రత
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు.
- వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్
మామిళ్లగూడెం, మే 28 : జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాకు చెందిన ఆర్వోలు, ఏఆర్వోలు, సీపీ, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ సునీల్ దత్, నగర పాలక కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్‌లు సమీక్షలో పాల్గొన్నారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఈవో దిశానిర్దేశం చేశారు. 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్లు ఒకేసారి లెక్కించాలని సూచించారు. ఫలితాల ప్రకటన కోసం మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, రౌండ్లవారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వీవీ ప్యాట్స్ నుంచి ఓటరు స్లిప్పులను తప్పనిసరిగా లెక్కించాలని ఆదేశించారు. ఆయా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది సెల్ఫోన్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని ఒకేచోట భద్రపరచాలని తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేలా అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

