తేలేది 5న…
ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం జూన్ 5వ తేదీన తేలనున్నది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమై ఉంది. ఈ నెల 27వ తేదీన జరిగిన పోలింగ్‌లో వివిధ రాజకీయపక్షాలు మద్దతు ప్రకటించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా పోరు సలిపారు.
- బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం
- జూన్ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు
- రాకేశ్‌రెడ్డి వైపు పట్టభద్రుల మొగ్గు!
- నల్గొండకు తరలిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యాలెట్ బాక్సులు
ఖమ్మం, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం జూన్ 5వ తేదీన తేలనున్నది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమై ఉంది. ఈ నెల 27వ తేదీన జరిగిన పోలింగ్‌లో వివిధ రాజకీయపక్షాలు మద్దతు ప్రకటించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా పోరు సలిపారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన బ్యాలెట్ బాక్సులను నల్గొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. జూన్ 5వ తేదీన మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఓట్లను నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో లెక్కించనున్నారు. పట్టభద్రులు తమ ఓటుహక్కును పెద్దఎత్తున వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన తీన్మార్ మల్లన్న, బీజేపీ మద్దతిచ్చిన ప్రేమేందర్‌రెడ్డితో పాటు పలువురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఖమ్మం జిల్లాలో 83,879 మంది ఓటర్లు ఉండగా 56,730 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40,106 ఓటర్లు ఉండగా 28,077 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శాసనమండలిని 2007లో పునరుద్ధరించిన విషయం విదితమే. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గం నుంచి దిలీప్‌కుమార్ పోటీచేశారు.
లాటరీ పద్ధతిన ఆయనకు కొన్ని సంవత్సరాలు మాత్రమే తొలిసారి అవకాశం రావడంతో పదవీకాలం ముగిసిన వెంటనే రెండోసారి పోటీచేసి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. అనంతరం 2015లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి పోటీచేసి విజయం సాధించారు. 2021లో జరిగిన ఎన్నికల్లోనూ తిరిగి పల్లా రాజేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి పునరుద్ధరణ తర్వాత నాలుగుసార్లు ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నట్లు వెల్లడైంది. ఐదోసారి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకే సానుకూల పవనాలు ఉండడం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విద్యావంతుడు కావడం, సామాజిక సేవారంగంలోనూ అగ్రగణ్యుడిగా ఉండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు విద్యార్థి, నిరుద్యోగ పట్టభద్రుల్లో గట్టి పట్టు కలిగి ఉండడం వంటి అంశాలతో రాకేశ్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడానికి దోహదపడే అంశాలుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాకేశ్‌రెడ్డి విజయం కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పర్యటించి ప్రశ్నించే గొంతుక, ఉన్నత విద్యావంతుడు అయిన రాకేశ్‌రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రులకు అండగా ఉంటారని, నిరుద్యోగ భృతి, జాబ్‌క్యాలెండర్ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు సలిపేందుకు అవకాశం ఉంటుందని నేతలు ఇచ్చిన పిలుపు పట్టభద్రులను ఆలోచింపచేసింది.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రులను నేరుగా కలవడంతోపాటు సభలు, సమావేశాల ద్వారా, మార్నింగ్వాక్ల ద్వారా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, మదన్‌లాల్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు ఆయా నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. అలాగే పార్టీ నియమించిన నియోజకవర్గ సమన్వయకర్తలు సైతం పట్టభద్రుల ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంతోపాటు ఎన్నిక విజయానికి సమన్వయం చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాకేశ్‌రెడ్డికి అన్ని నియోజకవర్గాల్లో మొదటి ప్రాధాన్యతా ఓటు అత్యధికంగా పోల్ కావడానికి దోహదపడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ రాకేశ్‌రెడ్డి ఏకపక్షంగా ఓట్లు లభించడం, ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ ఓట్లు మొదటి ప్రాధాన్యతలోనే రాకేశ్‌రెడ్డికి లభించడం, ప్రతిచోటా నిరుద్యోగ యువత, పట్టభద్రుల ఉద్యోగులు రాకేశ్‌రెడ్డి వైపు మొగ్గుచూపడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఓటువేసి బీఆర్ఎస్కు అండగా నిలిచినట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

