e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home ఖమ్మం పారా బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం కొనట్లేదు

పారా బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం కొనట్లేదు

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
అన్నదాతలను ఆ దిశగా చైతన్య పరచాలి
ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
మండలానికో సీనియర్‌ అధికారిని నియమించాలి
చెక్‌ పోస్టుల్లో పటిష్ట భద్రత ఏర్పాటుచేయాలి
వీడియో కాన్ఫరెన్సులో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

కొత్తగూడెం/ మామిళ్లగూడెం, నవంబర్‌ 27: వచ్చే యాసంగిలో పారా బాయిల్డ్‌ రైస్‌ను కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ స్పష్టం చేసినందున రాష్ట్ర రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా కలెక్టర్లు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వచ్చే యాసంగి సాగు ప్రణాళిక, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ ఎక్స్‌గ్రేషియా, పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో శనివారం సాయంత్రం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వానకాలం ధాన్యం కొనుగోలు కోసం వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించేందుకు మండలానికి ఒక సీనియర్‌ అధికారిని నియమించాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో జరగాలని సూచించారు. ఒక డోస్‌ తీసుకున్న వారి కాలపరిమితిని పరిశీలించి రెండో దోసు కూడా అందించాలని సూచించారు. కొవిడ్‌ ఎక్స్‌గ్రేషియా కోసం అందిన దరఖాస్తులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచాలని ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లాలో 245 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతువేదికల ద్వారా క్లస్టర్‌ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వచ్చే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీపీ విష్ణు మాట్లాడుతూ సరిహద్దు జిల్లాల పోలీసుల సహకారంతో పటిష్ట చర్యలు చేపడతామన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీసీఎస్‌వో రాజేందర్‌, జిల్లా మేనేజర్‌ సోములు, డీఆర్‌డీవో విద్యాచందన, డీఏవో విజయనిర్మల, డీఎంవో నాగరాజు పాల్గొన్నారు.
వీసీలో భద్రాది జిల్లా నుంచి కలెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడుతూ జిల్లాలో 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఎస్‌వో చంద్రప్రకాశ్‌, డీఎం ప్రసాద్‌, డీసీవో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో మధుసూధన్‌రాజు, డీఎంఓ నరేందర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement