నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు : ఏడీఏ వాణిశ్రీ
వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు, ఎర్రుపాలెం మండల ప్రత్యేక అధికారి వాణిశ్రీ హెచ్చరించారు. సోమవారం..
ఎర్రుపాలెం, జూన్ 08 : వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు, ఎర్రుపాలెం మండల ప్రత్యేక అధికారి వాణిశ్రీ హెచ్చరించారు. సోమవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు విత్తన దుకాణాలను ఆమె సీడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, వ్యవసాయ అధికారి బోయినపల్లి సాయి శివ, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిసులు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విత్తనాల విక్రయదారులు తప్పనిసరిగా అవసరమైన పత్రాలు కలిగి ఉండాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. సరైన పత్రాలు లేకుండా విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే స్టాక్ బోర్డులను తెలుగులోనే ప్రదర్శించాలని సూచించారు.
నిషేధిత హెచ్టీఎ (గడ్డిమందు తట్టుకునే) పత్తి విత్తనాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో రాత్రివేళల్లో ఎవరైనా అనుమానాస్పదంగా విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని డీలర్లకు సూచించారు. మండలంలో ప్రస్తుతం 13,550 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 15,252 మిరప విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, అదనంగా వరి, మొక్కజొన్న విత్తనాలు కూడా సమృద్ధిగా నిల్వ ఉన్నాయని తెలిపారు. రైతులు విత్తనాల లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాల నివారణకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుండడం హర్షణీయమని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు బాలకృష్ణ, వంశీకృష్ణ, కృష్ణకుమారి, అనూష, డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు : ఏడీఏ వాణిశ్రీ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

