రెండురోజులు 144 సెక్షన్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు.
- సీపీ సునీల్ దత్
మామిళ్లగూడెం, మే 11 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 6 నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, గుంపులుగా గుమిగూడి ప్రచారాలు నిర్వహించొద్దని పేరొన్నారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఐదుగురికి మించకుండా మైకులు, స్పీకర్లు లేకుండా ఇంటింటికి ప్రచారం చేసుకునే వారికి ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్, ఫారెస్ట్, కేంద్ర బలగాలు, హోంగార్డులు, ఎస్పీవోలకు నిషేధ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ విషయంలో అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరం వరకు ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించొద్దన్నారు. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాతాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదన్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం, చట్టబద్ధమైన అధికారానికి భంగం కలిగించే లేదా ధికరించే నేరానికి దారితీసే అవకాశం ఉన్న ఏదైనా ప్రసంగం నిషేధమని ఆయన పేర్కొన్నారు.
భద్రాద్రి జిల్లాలో14 వరకు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు
భద్రాద్రి జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులోకి తెచ్చినట్లు జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సభలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని, పోలింగ్ రోజున కేంద్రాల చుట్టూ గుంపులుగా తిరగొద్దని సూచించారు. ఈ విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సీ-విజిల్ యాప్ ద్వారా, లేదా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో పోలింగ్ సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 971 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 146 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి మొత్తం రూ.3.70 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, మొత్తం 660 కేసుల్లో 1,082 మంది వ్యక్తులను బైండోవర్ చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతా బలగాలతో సంయుక్తంగా ‘ఫ్లాగ్ మార్చ్’ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

