జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం మరో పోరాటానికి సిద్ధం
దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం, అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఫండ్, హెల్త్‌కార్డుల కోసం జర్నలిస్టులు మరో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు.
- టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ
ఖమ్మం, జూన్ 18 : దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం, అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఫండ్, హెల్త్‌కార్డుల కోసం జర్నలిస్టులు మరో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ ఖమ్మంజిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్హజారి, టెంజు రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణకుమార్, రాష్ట్ర కోశాధికారి యోగానంద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కళ్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్లం నారాయణ మాట్లాడుతూ కడుపు కట్టుకొని మన సమస్యలను వదిలి రాష్ట్ర సమస్యలపై పోరాడిన చరిత్ర జర్నలిస్టులదే అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు, జర్నలిస్ట్ సంక్షేమ నిధి, అక్రిడిడేషన్లు ఈ నాలుగు అంశాలపై మరో పోరాటానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్న సమయంలో 100 కోట్లతో జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకున్నామని, రూ.15 కోట్లతో మీడియా అకాడమీ భవనం నిర్మించామని తెలిపారు.
ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంచాలి
ఖమ్మంజిల్లాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా జీవో జారీ చేసి కేటాయించిన 26 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు పంచేంత వరకు ఉద్యమించాలని అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న ఖమ్మంజిల్లా కమిటీ చొరవను అభినందించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌రావు మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సాధనకు రాష్ట్ర కమిటీ నుంచి వచ్చి ఖమ్మంజిల్లా జర్నలిస్టుల ఉద్యమంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఖమ్మంజిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జర్నలిస్టులకు అందాల్సిన ఇంటిస్థలాలు అందకుండా పోయాయన్నారు. ఖమ్మంజిల్లాలో 23 ఎకరాలు, కొత్తగూడెం జిల్లాలో 17 ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపినా అందకపోవడం శోచనీయమన్నారు. యూనియన్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం టీయూడబ్ల్యూ(టీజేఎఫ్) ద్వారానే సాధ్యమన్నారు. జర్నలిస్టుల కష్టకాలంలో అండగా నిలిచింది టీజేఎఫ్ యూనియన్ మాత్రమే అన్నారు. ఖమ్మంజిల్లా కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ ఖమ్మంజిల్లాలో యూనియన్ బలంగా పని చేస్తున్నదన్నారు. కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు.
రామోజీరావు, తమ్మిశెట్టికి నివాళి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విస్తృతస్థాయి సమావేశంలో తొలుత ఇటీవల మృతిచెందిన ఈనాడు సంస్థల అధినేత, జర్నలిస్టు రామోజీరావు, ఇల్లెందుకు చెందిన జర్నలిస్టు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మృతి పట్ల నివాళులు అర్పించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర బాధ్యులను సతరించారు. సమావేశంలో బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్‌రెడ్డి, లింగయ్య, శెట్టి రజనీకాంత్, వనం నాగయ్య, మందుల ఉపేందర్, భారతి, పిన్ని సత్యనారాయణ, ఉదయ్, శ్రీధర్‌శర్మ, గుద్దేటి రమేశ్, ఎలమందల జగదీశ్, అశోక్, జల్ది శ్యామ్, నాగరాజు, వివిధ పత్రికల జిల్లా బ్యూరోలు, స్టాఫర్లు, మండల, నియోజకవర్గస్థాయి విలేకరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

