ఖమ్మంలో నామాదే గెలుపు..
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం తన స్వగ్రామమైన పిండిప్రోలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
తిరుమలాయపాలెం, మే 13 : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం తన స్వగ్రామమైన పిండిప్రోలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు చెప్పారు. ఈసారి విజ్ఞతతో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి నామాకు ఓట్లు వేసినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఈ ప్రాంత ప్రజలకు తెలియకపోవడం, బీఆర్ఎస్ అభ్యర్థి నామా ఈ ప్రాంతానికి చెందినవాడు కావడం, ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల భారీగా ఓట్లు పోలైనట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కూసుమంచి మండలం చేగొమ్మ నివాసి అని ప్రచారం చేసుకున్నా ఆయన ఆ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అక్కడ పది మంది పేర్లు కూడా ఆయనకు తెలియదన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని పలు సర్వేలు తెలిపాయని గుర్తు చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి రావడం, కాంగ్రెస్ విధానాలను ఎండగట్టడం వల్ల బీఆర్ఎస్కు మంచి గ్రాఫ్ పెరిగిందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెల్లం వేణు, సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు, ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు పరికపల్లి చంద్రశేఖర్, పసలాది ముత్తయ్య, నాయకులు తాతా రవీందర్, దూదిమెట్ల శ్రీను, చామకూరి కిరణ్, వెంకట్, శరత్, గోకినపల్లి ఉపేందర్, ఐలపొంగు వెంకన్న, గోపోజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

