బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కొడుకును కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో బాలిక కుటుంబ సభ్యులపై సాగిస్తున్నది దుర్మార్గపు చర్య. ఇలాంటి దారుణమైన ఘటనలో బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి.. నిందితులను రక్షించడానికి అధికార యంత్రాంగం, పోలీసులు బరితెగించడం అత్యంత దారుణం.
కేసులో అత్యంత కఠినంగా ఉండాల్సిన పోక్సో చట్టం సెక్షన్లను కావాలనే బలహీనపరిచి, నిందితుడిని బయటపడేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు సరికాదు. నిందితుడైన బండి భగీరథను అరెస్ట్ చేయకపోగా.. బాధితులపైనే కేసు పెట్టడం ఆశ్చరంగా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలి. బండి భగీరథను అరెస్ట్ చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు సాగిస్తాం.