కాయ్ రాజా కాయ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలపై పందేలు జోరందుకున్నాయి. ‘కాయ్ రాజా కాయ్' అంటూ కాలుదువ్వుతున్నారు. ఆయా అభ్యర్థుల విజయావకాశాలపై పందెంరాయుళ్లు, ఔత్సాహికులు రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా ఎన్నికల పందేలు
- ఆయా అభ్యర్థుల విజయాలపై రూ.లక్షల్లో బెట్టింగ్
- వివిధ పార్టీలకు వచ్చే సీట్లపైనా జోరుగా పందేలు
- పొరుగునున్న ఏపీలో రూ.1కి రూ.2 ఇచ్చేలా బెట్లు
- ఎన్నికల ఫలితాలు దగ్గరపడడంతో ఉత్కంఠగా బెట్
- మధ్యవర్తుల వద్దకు ముందుగానే చేరుకున్న డబ్బు?
- ఒప్పందపత్రాలూ రాసుకుంటున్న పందెంరాయుళ్లు!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలపై పందేలు జోరందుకున్నాయి. ‘కాయ్ రాజా కాయ్’ అంటూ కాలుదువ్వుతున్నారు. ఆయా అభ్యర్థుల విజయావకాశాలపై పందెంరాయుళ్లు, ఔత్సాహికులు రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. వివిధ పార్టీలకు వచ్చే సీట్లపైనా జోరుగా పందేలు పెడుతున్నారు. పొరుగునున్న ఏపీలో అయితే రూ.1కి రూ.2 ఇచ్చేలా బెట్లు ఉంటున్నాయి. ఇక ప్రత్యేకమైన, ప్రతిష్ఠాత్మకమైన ఖమ్మం స్థానంపైనా, ఇక్కడి అభ్యర్థుల ఓట్లు, మెజార్టీలు వంటి అంశాలపైనా భారీగా బెట్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు దగ్గరపడడంతో మరింత ఉత్కంఠగా రంగంలోకి దిగుతున్నారు.
ఖమ్మం, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలు కూడా ముగియడం, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మొన్నటి వరకూ రసవత్తరంగా సాగడం వంటి అంశాల నేపథ్యంలో ‘అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది?’ వంటి అంశాలపై ఉమ్మడి జిల్లాలో పందేలు హోరెత్తుతున్నాయి. పందేనికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి వచ్చే ఓట్ల శాతం నుంచి..
‘ఆంధ్రపదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీకి లభించే ఓట్ల శాతం ఎంత? కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు ఎన్ని? బీఆర్ఎస్ విజయం సాధించే స్థానాలు ఎన్ని? అభ్యర్థులకు వచ్చే మెజారిటీ ఎంత?’ వంటి అంశాలపై పలు ప్రాంతాల్లో రూ.లక్షల్లో పందేలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆయా పార్టీల అభిమానులతోపాటు బెట్టింగ్ రాయుళ్లు కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. ప్రధానంగా ఏపీ ఎన్నికలపై రూ.కోట్లల్లో పందేలు కాస్తున్నారు. అక్కడ వైసీపీకి 120 సీట్లు వస్తాయని ఒకరు.. టీడీపీ అధికారంలోకి వస్తుందని మరొకరు ధీమా వ్యక్తం చేస్తూ రూ.40 లక్షలు పందెం వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో రూ.1కి రూ.2 ఇచ్చేలా..
ఏపీలోని జంగారెడ్డిగూడేనికి చెందిన ఆయా పార్టీల నేతలు.. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందనే బెట్‌పై రూ.1కి రూ.2 ఇచ్చే ఒప్పందంతో రూ.25 లక్షలు పందెం కాయడంతో ఈ ఎన్నికలపై పందేల జోరు ఏ విధంగా కొనసాగుతుందో అవగతమవుతోంది. అలాగే, ‘కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు లభిస్తాయి? బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి?’ వంటి అంశాలపై కూడా పందేలు కొనసాగడం విశేషం. ప్రధానంగా ఏపీలోని పిఠాపురం నుంచి టీడీపీ కూటమి జనసేన అభ్యర్థి పవన్‌కల్యాణ్, వైసీపీ అభ్యర్థి వంగా గీత మధ్య ఉత్కంఠ భరితమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఎవరు గెలుస్తారనే అంశంపై పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. ఇక ఏపీలో పోటీ చేస్తున్న టీడీపీ నేతలు లోకేశ్, చంద్రబాబు, జనసేన అధినేత
పవన్‌కల్యాణ్ కన్నా..
వైసీపీ అధినేత, అక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి పులివెందులలో ఎంత మెజారిటీ లభిస్తుందనే అంశంపై జోరుగా పందేలు కాశారు. పందెంరాయుళ్లు ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణను తెలుసుంటున్నారు. సమాచారాన్ని సేకరిస్తున్నారు. వివిధ ఏజెన్సీల సర్వేలు, వాటి అంచనాల ఆధారంగా పెద్ద ఎత్తున పందేల కాస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దున ఉన్న తిరువూరు, నూజివీడు, భద్రాద్రి జిల్లా సరిహద్దున ఉన్న చింతలపూడి, జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతాలకు చెందిన నేతలు ఖమ్మం జిల్ల్లా వారితో పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. ఫలానా అభ్యర్థి గెలుస్తాడని పందేనికి దిగుతున్న నేతలు.. పందెం డబ్బు మొత్తాన్ని వెంటనే జమ చేసి తాము నమ్మిన మధ్యవర్తుల వద్ద పెడుతున్నారు. ఇందుకు సంబంధించి ఒప్పంద వ్యవహారాలకు పత్రాలు సైతం రాసుకోవడం గమనార్హం.
ఖమ్మం స్థానంపై కూడా..
ఇక ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ప్రధాన అభ్యర్థులపైనే కాకుండా స్వతంత్ర అభ్యర్థులపై కూడా పందేలు వేస్తుండడం గమనార్హం. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయంపైనా, ఆయనకు లభించే మెజారిటీపైనా, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయంపైనా, మెజారిటీపైనా పెద్ద ఎత్తున పందేలు కొనసాగుతున్నాయి. అలాగే, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు లభించే ఓట్ల శాతంపై సత్తుపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున పందేలు నడుస్తున్నాయి. ఆయనకు లక్ష ఓట్లు దాటుతాయని ఒకరు రూ.5 లక్షల పందెం వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
‘కేంద్రం’పై పెద్ద ఎత్తున పందేలు..
ఇక బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే అంశంపై కూడా పెద్ద ఎత్తున పందేలు కొనసాగాయి. గెలుపోటములపై ఫలనా వారితో పందెం ఉందనే సమాచారం రాగానే మధ్యవర్తుల ద్వారా పందెంరాయుళ్లు సదరు వ్యక్తులను సంప్రదించి ఆయా పార్టీల విజయాలపై పార్టీ నేతలు రూ.లక్షలు పందెం కాస్తుండడం విశేషం. తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 13న ఎన్నికలు పూర్తి కావడంతో ఆరోజు సాయంత్రం నుంచే పందేల జోరు హోరెత్తుతోంది. ఇప్పటికే పందేల రూపంలో రూ.కోట్లు మధ్యవర్తుల వద్ద జమ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మంలో కూడా కొందరు పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. ‘తెలంగాణలో ఏ పార్టీ రెండో స్థానంలో ఉంటుంది? బీజేపీకి లభించే ఓట్లు ఎన్ని? సాధించే సీట్లు ఎన్ని? అంటూ వేర్వేరుగా రూ.లక్షల్లో పందేలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులపై కూడా పెద్ద ఎత్తున పందేలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

