ఖమ్మం:బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ల ఆధ్వర్యంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అసోసియన్ ప్రతినిధులకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, రామబ్రహ్మం దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మేయర్ ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులకు పుష్పగుచ్చం అందజేసిశుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు రేకల బాస్కర్, భద్రాది బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, స్వామిరమేష్ తదితరులు ఉన్నారు.