హైదరాబాద్‌కు మెట్రో మణిహారం
అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- రూ.6,250 కోట్లతోఎయిర్పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో
- శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 11.23 గంటలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో వేదికపైన చండీమాత వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, సాయన్న, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆనంద్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, కె.నవీన్‌కుమార్, పట్నం మహేందర్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, రావుల శ్రీధర్‌రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎం రావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, దేశ్‌పతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భారీ శిలాఫలకం
మైండ్‌స్పేస్ వద్ద ‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్’ పేరిట భారీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కాగా శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ బస్సు దిగిన వెంటనే నినాదాలతో హోరెత్తించారు. దేశ్ కీ నేత, జై బీఆర్ఎస్ అంటూ స్లోగన్స్ మిన్నంటాయి.
కాలుష్య రహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రో. దీన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరమున్నది. అందుకే హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు వలయం ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా గ్రేటర్ చుట్టూ మెట్రో సేవలను విస్తరిస్తాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ రాలేదు. ఈ లోపాన్ని తీర్చేందుకే రూ.6,500 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టును మూడేండ్లలో విజయవంతంగా పూర్తి చేస్తాం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

