Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు.
మధిర, ఏప్రిల్ 15 : అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో, రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలన్నారు. అనంతరం తొలి సభ్యత్వాన్ని సీనియర్ జర్నలిస్టులు అట్లూరి సాంబిరెడ్డి, కొంగర మురళి చేతుల మీదగా జర్నలిస్టులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రావిరాల శశి కుమార్, మువ్వా మురళి, మక్కెన నాగేశ్వరరావు, కిలారి కిశోర్, నాళ్ల శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావు, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, సుంకర సీతారాములు, చల్లా శ్రీనివాసరెడ్డి, మువ్వా రామకృష్ణ, రావూరి కృష్ణ ప్రసాద్, దుబాసి రాజేశ్, రాము, మధు, పల్లబోతు ప్రసాదరావు, వేముల నవీన్, కొంగల విజయ్, పసుపులేటి ఈశ్వర్ రవితేజ, ఆదూరి విజయ్ రాజు, లిక్కి రవీంద్ర, చారుగుండ్ల లక్ష్మీ, నరసింహమూర్తి, తలారి రమేశ్, పగిడిపల్లి ప్రభాకర్, కంచపోగు కోటేశ్వరావు, వేల్పుల పవన్, దోర్నాల కృష్ణ, సంతోష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

