వర్షాకాలం సమీపిస్తోంది..ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలి..
వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
- వైద్యశాఖ సూచనలు పాటించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి: ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్
భద్రాచలం, మే 19: వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం చెదురుమదురు వర్షాలు పడుతున్న సందర్భంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇంటి ఆవరణలో పాత కూలర్లు, పూల కుండీలు, పాత టబ్బులు, పాత టైర్లు, పాత వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిలో వర్షపు నీరు నిలువకుండాజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాటిల్లో వర్షపు నీరు చేయడం వల్ల దోమలు గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయని అన్నారు. దోమలు కుట్టడం వల్ల డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు, మెదడు వాపు తదితర ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వివరించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో కచ్చితంగా డ్రైడేగా పాటించి ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా జగ్రత్త పడాలని ఆదేశించారు.
జ్వరం వచ్చినట్లయితే గ్రామంలో ఉన్న ఆశావర్కర్నుగానీ, వైద్య సిబ్బందిని గానీ సంప్రదించాలని సూచించారు. వారు ప్రథమ చికిత్స చేసి సలహాలు సూచనలు ఇస్తారని అన్నారు. అవసరమైన ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి రక్త పరీక్ష చేయిస్తారని, నమూనాలను టీ హబ్‌కు పంపించి వ్యాధులను నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఎక్కువగా యాంటీ బయోటిక్ మందులు వాడినట్లయితే ప్రజలకు వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుందని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

