ఖమ్మంలో వైద్య పోస్టుల భర్తీ.. దరఖాస్తులకు ఆహ్వానం.. పూర్తి వివరాలివీ..

ఖమ్మం : ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలమేరకు జిల్లాలోని పల్లె దవాఖానాల్లో వైద్యాధికారుల పోస్టులభర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ బీ. మాలతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులని, 2021 జులై నాటికి 34 సంవత్సరాలు నిండి ఉండాలని ఆమె
వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏండ్లు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు 3 ఏండ్లు సడలింపు ఉంటుందని తెలిపారు. నియామకాలు రోల్ ఆఫ్ రిజర్వేషన్లను అనుసరించి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా 90శాతం, వయస్సు ప్రాతిపదికన 10శాతం కలుపుకుని మెరిట్ జాబితాను రూపొందిస్తామన్నారు.
జిల్లాలోని బోదులబండ పీహెచ్సీ పరిధిలో-5, బోనకల్-8, చెన్నూరు-5, చింతకాని-9, ఏన్కూరు-10, కల్లూరు-5, కామేపల్లి-5, మంచుకొండ-9, సింగరేణి-4, తల్లాడ-9, వేంసూరు-8, వైరా-9 మొత్తం కలిపి జిల్లాలోని 86 పల్లె దవాఖానాల్లో ఖాళీలు ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

