సమీకృతం సిద్ధం
ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనకు అనుగుణంగా కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేట్ ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
- ఎల్లుండి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం
- ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
- 1.50 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
- అన్ని శాఖలూ ఒకే చోట.. 51 మంది అధికారులకు ప్రత్యేక చాంబర్లు
- సముదాయానికి ‘కార్పొరేట్’ హంగులు
- వాకింగ్ ట్రాక్, క్రీడా ప్రాంగణం అదనం
- 12న కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ పర్యటన
‘26 ఎకరాల సువిశాల స్థలం.. రూ.44.98 కోట్ల నిధులతో సముదాయం నిర్మాణం.. అందమైన గార్డెనింగ్.. మూడు సమావేశ మందిరాలు.. జీ ప్లస్ 2లో గ్రౌండ్ ఫ్లోర్ 19, ఫస్ట్ ఫ్లోర్ 25, సెకండ్ ఫ్లోర్లో 13 బ్లాక్‌లు.. జిల్లా అధికారులకు ప్రత్యేక చాంబర్లు.. దివ్యాంగుల కోసం ట్రాక్ సిస్టమ్.. కార్యాలయం చుట్టూ వాకింగ్ ట్రాక్, పక్కనే క్రీడా ప్రాంగణం.. ఇలా అన్ని ‘కార్పొరేట్’ హంగులతో కొత్తగూడెం కలెక్టరేట్ సిద్ధమైంది.. ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లాంఛనంగా దీనిని పారంభించనున్నారు. ఏర్పాట్లను సోమవారం భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండొద్దని అధికారులను ఆదేశించారు. మరో వైపు సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
– భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 9 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనకు అనుగుణంగా కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేట్ ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అన్ని శాఖలూ ఒకే దగ్గర ఉండేలా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కలెక్టరేట్ పచ్చటి మొక్కలతో సువిశాల మైదానంలో సర్వహంగులతో ముస్తాబైంది. సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. ప్రజలకు అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నది ఆయన ఆలోచన. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నూతన కలెక్టరేట్లలో భాగంగా భద్రాద్రి సమీకృత కలెక్టరేట్ భవనం జిల్లా ప్రజలకు అంకితం కానున్నది. సువిశాల ప్రాంగణంలో పచ్చటి మొక్కల మధ్య ఎత్తయిన ప్రదేశంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. 1.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఈ కలెక్టరేట్లో 51 శాఖల అధికారులకు చాంబర్లను ఏర్పాటు చేశారు. 250 మంది ఒక దగ్గరే సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ అందుబాటులోకి తెచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పాల్వంచ, కొత్తగూడెం జంట పట్టణాల మధ్యలో ఉన్న ఈ కొత్త కలెక్టరేట్ ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాన్ని పూర్తి చేశారు.
‘కార్పొరేట్’ హంగులు..
కార్పొరేట్ హంగులతో దర్శనమిస్తోంది భద్రాద్రి నూతన కలెక్టరేట్. చుట్టూ పచ్చని మొక్కలు, వాకింగ్ ట్రాక్, ఆట స్థలం, ప్రశాంత వాతావరణం వంటివి సముదాయ సొంతం. 51 మంది అధికారుల చాంబర్లను ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ పేరుతో ఆరు బ్లాకులుతోపాటు 3 మీటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు దివ్యాంగులు వచ్చే విధంగా ట్రాక్ సిస్టమ్నొ అందుబాటులో ఉంచారు. జీ ప్లస్ 2 మూడు బ్లాకులుగా ఉన్న ఆ కలెక్టరేట్‌ను చూస్తే తెలంగాణ కొత్త జిల్లాలో అధికారుల సముదాయం ఈ స్థాయిలో ఉందా? అనిపిస్తుంది.
శాఖలకు చాంబర్ల కేటాయింపు..
జిల్లా అధికారులకు కొత్త కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ చాంబర్లను కేటాయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులను కొత్త కలెక్టరేట్‌కు పిలిచి వారికి కేటాయించిన చాంబర్లను అప్పగించారు. మూడు రోజుల్లో అక్కడ బ్లాకుల్లో పర్నిచర్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సీఎం ప్రారంభిన మరుసటి రోజు నుంచే ఇక్కడ విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. మొత్తం 51 శాఖల అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు. కొన్ని శాఖలు మాత్రం తమ సొంత భవనాల్లోనే ఉండనున్నాయి. జిల్లా పరిషత్, ఆర్డీవో కార్యాలయాలు కొత్తగూడెంలోనే ఉండనున్నాయి.
నివాస సముదాయాలు..
కలెక్టర్‌తోపాటు మరో ఇద్దరు అదనపు కలెక్టర్లకూ కూడా ఇక్కడే నివాస సముదాయాలను ఏర్పాటు చేశారు. నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణలో ముఖద్వారం వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు. కలెక్టరేట్ వెనుక భాగంలో మూడు నివాస సముదాయాలను సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకు వచ్చారు.
సర్వం సిద్ధం చేశాం..
నూతన కలెక్టరేట్ భవన సముదాయాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్ల్లు పూర్తి చేశాం. ఇప్పటికే సంబంధిత అధికారులకు చాంబర్లను కేటాయించాం. అధికారులందరూ ఒకే దగ్గర ఉండడంతోప్రజలకు పరిపాలన చేరువకానుంది. అందుకోసమే సీఎం కేసీఆర్ ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించారు. సంక్రాంతికి ముందు నుంచే కొత్త కలెక్టరేట్‌కు అన్ని శాఖల అధికారులు రాబోతున్నారు. ఈ నెల 12న సీఎం కేసీఆర్ ఈ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు.
-అనుదీప్, భద్రాద్రి కలెక్టర్
చకచకా ఏర్పాట్లు..
కలెక్టరేట్ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే హెలీపాడ్‌ను ఏర్పాటు చేయడంతో అక్కడ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నందున స్టేజీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు కలెక్టరేట్లో అధికారుల సమీక్ష ఉన్నందున అక్కడ అన్ని ఏర్పాట్ల్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులంతా లక్ష్మీదేవిపల్లి నుంచి పాల్వంచ వరకు రహదారి చుట్టుపక్కన దారులను పరిశుభ్రం చేయిస్తున్నారు. కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి వారికి కేటాయించిన విధులు గురించి తెలియజేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

