ఈ-కేవైసీపై అంతటా అయోమయం
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తాము సిలిండర్ పొందుతున్న సంస్థల్లో తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
- ప్రక్రియ పూర్తికాకపోతే ‘రూ.500 సిలిండర్’ రాదేమోనని వినియోగదారుల ఆందోళన
- గ్యాస్ ఏజెన్సీల వద్ద గంటల కొద్దీ పడిగాపులు
- ఈ-కేవైసీకి, ప్రభుత్వ రాయితీలకు సంబంధం లేదని అధికారుల స్పష్టీకరణ
- ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎలాంటి గడువు లేదని ప్రకటన
ఖమ్మం, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తాము సిలిండర్ పొందుతున్న సంస్థల్లో తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏళ్ల నుంచి గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేస్తున్నప్పటికీ వినియోగదారుల తాజా వివరాలు రికార్డు చేయడం కోసమే ఈ ఈ-కేవైసీ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు తమ గ్యాస్ ఏజెన్సీల ద్వారా దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపడుతున్నాయి. ప్రక్రియ పూర్తి చేసేందుకు కొన్ని రోజుల నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ఎదుట గంటల కొద్దీ బారులు తీరుతున్నారు. ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేదే అని అధికారులు చెబుతున్నా, అదే తంతు ఇప్పటికీ కొనసాగుతున్నది. ప్రక్రియపై వినియోగదారులకు స్పష్టత, అవగాహన లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందనేది వాస్తవం.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
ఖమ్మం జిల్లాలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,01,640, డబుల్ సిలిండర్ కనెక్షన్లు 78,023, దీపం పథకం కనెక్షన్లు 59,742, సీఎస్సార్ కనెక్షన్లు 23,688, ఉజ్వల కనెక్షన్లు 47,311 ఉండగా గ్యాస్ ఏజెన్సీలు 34 ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులు ఈ- కేవైసీ పూర్తయితేనే ఆ సిలిండర్ వస్తుందని భావిస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తిండీ తిప్పలు మానేసి రేషన్, ఆధార్‌కార్డు, వంటగ్యాస్ కార్డు జిరాక్సులతో ఈ కేవైసీ చేయిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ రాయితీలకు, ఈ కేవైసీకి ఎలాంటి సంబంధం లేదని, ఈ కైవైసీ చేసుకోకపోయినా రాయితీ వర్తిస్తుందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నా ఏజెన్సీల వద్ద రద్దీ తగ్గడం లేదు. అధికారులు ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కేవైసీపై అవగాహన కల్పిస్తే బాగుంటుందంటున్నారు. వినియోగదారుల ఇబ్బందులు తొలగించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ముందడుగు వేసింది. ఓ మొబైల్ యాప్ రూపొందించింది. యాప్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ కేవైసీపై ‘నమస్తే’ జిల్లా ఫౌరసరఫరాల అధికారి శ్రీలతను వివరణ కోరగా.. ‘ఈ కేవైసీ ఎలాంటి గడువు విధించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలకు ఈ కేవైసీకి ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దు. ఎప్పుడైనా ఈ కేవైసీ చేసుకోవచ్చు..’ అని సమాధానమిచ్చారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

