పెరగట్లే.. తగ్గట్లే!
స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా ఉంటాయో.. తేజా రకం మిర్చి ధరల పరిస్థితి కూడా ఇంచుమించు అదే తరహాలో కొనసాగుతోంది. అంటే ప్రతి రోజు ధర తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. సీజన్లో మిర్చి పంటకు పలికిన ధరకంటే ఏసీలో నిల్వ ఉంచిన పంటకు ధర పెరగడం సర్వసాధారణం. కానీ.. ఈ ఏడాది ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.
- పది రోజులుగా ఏసీ మిర్చి క్వింటాల్ రూ.19,300
- ఖమ్మం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి
- అమ్ముకోవాలా.. వద్దా.. అని రైతుల అయోమయం
ఖమ్మం వ్యవసాయం, జూలై 24 : స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఎలా ఉంటాయో.. తేజా రకం మిర్చి ధరల పరిస్థితి కూడా ఇంచుమించు అదే తరహాలో కొనసాగుతోంది. అంటే ప్రతి రోజు ధర తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. సీజన్లో మిర్చి పంటకు పలికిన ధరకంటే ఏసీలో నిల్వ ఉంచిన పంటకు ధర పెరగడం సర్వసాధారణం. కానీ.. ఈ ఏడాది ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.
గత సంవత్సరం మార్కెట్‌కు పంట బాగా రాకపోవడంతో క్వింటాల్ రూ.22 వేల వరకు గరిష్ట ధర పలికింది. దీంతో ధర మరింత పెరగవచ్చనే ఉద్దేశంతో రైతులతోపాటు కొందరు ఖరీదుదారులు పంటను కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేసుకున్నారు. అయితే పక్షం రోజులుగా పైసా తేడా లేకుండా జెండాపాటలో ఒకే ధర పలుకుతుండడం పట్ల రైతులు, అడ్తీ వ్యాపారులు ఆందోళనతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ జెండాపాటలో అదే ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆది నుంచి అపరాలు, పత్తి, మిర్చి క్రయవిక్రయాలకు సంబంధించి జెండాపాట ద్వారా గరిష్ట ధర నిర్ణయం జరుగుతుంది. ఈ-నామ్ అమల్లోకి వచ్చిన తర్వాత పత్తి, అపరాలు మినహా మిర్చి క్రయవిక్రయాల్లో మాత్రమే జెండాపాట పాడుతున్నారు. ఖరీదుదారుల్లో పోటీతత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో జెండాపాట నిత్యం ఉదయం 7: 30 గంటలకే నిర్వహిస్తారు. అయితే ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు వరుసగా జెండాపాటలో తేజా రకం ఏసీ మిర్చి పంటకు క్వింటాల్ గరిష్ట ధర రూ.19,300 మాత్రమే పలుకుతున్నది. దీంతో అటు రైతులు, కార్మికులు, అడ్తీ వ్యాపారులు సైతం నివ్వెరపోతున్నారు. జెండాపాటలో చాలామంది ఖరీదుదారులు పాల్గొంటున్నారు.
పోటాపోటీగా పాట నడుస్తున్నప్పటికీ చివరకు రూ.19,300 వరకు వచ్చి ఆగిపోతున్నది. కరెక్టుగా అక్కడే ఎందుకు పాట ఆగుతుంది అర్థంకాని పరిస్థితి. పైగా ఎగుమతులు లేకపోవడం, జాతీయ మార్కెట్లో సైతం డిమాండ్ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో గరిష్ట ధర తగ్గకుండా కాపాడుతున్నామని చెబుతున్నారు. ఇతర మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఖమ్మం మార్కెట్లో కూడబలుక్కొని జెండాపాట దాటకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఏసీ రకం మిర్చిపంటకు ధర పెరగకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోల్డ్ స్టోరేజ్‌లో పంటను మరింత కాలం నిల్వ ఉంచుకోవాలా.. అమ్ముకోవాలా.. తెలియక అయోమయంలో ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

