‘సీతారామ’ పనులను అడ్డుకున్న అఖిలపక్షం
సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ నిర్మాణ పనులను సోమవారం అడ్డుకున్నారు.
- జూలూరు పాడుకు సాగు, తాగునీరు ఇవ్వాలని డిమాండ్
- ఈ ప్రాంత రైతాంగాన్ని విస్మరిస్తే కాంగ్రెస్కు గుణపాఠం చెబుతాం
- పనులను నిలిపివేయకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాలు
జూలూరుపాడు, జూలై 15 : సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ నిర్మాణ పనులను సోమవారం అడ్డుకున్నారు. తహసీల్దార్ స్వాతిబిందుకు ఆమె కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి మండలంలోని కాకర్ల, గుండెపుడి, పాపకొల్లు గ్రామాల్లోని చెరువులకు పిల్ల కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయుల కాలం నాటి పోలారం చెరువుకు మరమ్మతులు చేపట్టి ప్రాజెక్ట్ను నీటితో నింపితే జూలూరుపాడు, సుజాతనర్ మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగు నీరందించవచ్చని తెలిపారు. అలా చేయకుండా..
ఈ ప్రాంత రైతాంగాన్ని విస్మరిస్తే భవిష్యత్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. మండల రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా వినోభానగర్ నుంచి సాగర్ కెనాల్ వరకు మంజూరైన లింక్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, లేకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ముగ్గురు మంత్రులుండి.. జూలురుపాడు మండలంలోని రైతుల భూములను ఎండబెట్టేందుకు లింక్ కెనాల్ పేరుతో డిజైన్ మార్చి పనులను శరవేగంగా చేపట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు జాటోత్ కృష్ణ, చండ్ర నరేంద్రకుమార్, ఉమర్మియా, ఏదులాపురం గోపాలరావు, గుండుపిన్ని వెంకటేశ్వర్లు, యాసా నరేశ్, వల్లోజి రమేశ్, చాంద్పాషా, బానోత్ మధు, వల్లమల చందర్రావు, లకావత్ శ్రీను, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, గడిదేశి కనకరత్నం, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

