ఖమ్మం : తెలంగాణ స్టేట్ కో-ఆఫరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) లో జరిగిన పలు కార్యక్రమాలలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు. హైద్రాబాద్‌లో జరిగిన టెస్కాబ్ సమావేశం, అనంతరం టెస్కాబ్ విశ్రాంతి భవనం ప్రారంభోత్సం కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవిందర్‌రావు, మేనేజింగ్ డైరక్టర్ నేతి మురళీదర్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. డీసీసీబీ, టెస్కాబ్ బలోపేతానికి మురళీధర్‌రావు చేస్తున్న కృషి అభిందనీయమన్నారు. నేడు జాతీయ స్థాయిలో టెస్కాబ్‌కు మంచి గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యకర్రమంలో టెస్కాబ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.