రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దానసరి పుల్లయ్య పర్యటించారు. కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు రాజేష్ తో కలిసి ఆయన గుర్రాలపాడు, గుదిమళ్ల, కొత్తగూడెం, వెంకటగిరిలో..
ఖమ్మం రూరల్, అక్టోబర్ 09 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దానసరి పుల్లయ్య పర్యటించారు. కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు రాజేష్ తో కలిసి ఆయన గుర్రాలపాడు, గుదిమళ్ల, కొత్తగూడెం, వెంకటగిరిలో పర్యటించారు. వెంకటగిరి రైతు వేదికలో ఎం జి జి 385 పెసర విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ యంత్రాల సద్వినియోగం గూర్చి క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఏవో పుల్లయ్య మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం ప్రత్యక్షంగా కనపడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రైతులు పంటల సాగులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
రాబోయే రబీ సీజన్లో సైతం అతి తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. నేల స్వభావం, తక్కువ నీటి వనరులతో సాగు అయ్యే పంటల సాగు మాత్రమే చేపట్టాలని రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలుగా అపరాల పంటల సాగు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని, ఎప్పటికప్పుడు విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారి సలహాలు సూచనలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి జై ఉమా నాగేష్, విస్తరణ అధికారులు వంశీ, ఆదర్శ్, పలువురు రైతులు పాల్గొన్నారు.

రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

