9న గ్రూప్-1 ప్రిలిమ్స్
ఈ నెల 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
- పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
- జిల్లాల్లో తాగునీటి సరఫరాపై నివేదికలు పంపాలి
- విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రావద్దు
- కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి
మామిళ్లగూడెం, జూన్ 6: ఈ నెల 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ‘గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ, వానకాలం సీజన్ విత్తనాలు, ఎరువుల లభ్యత, తాగునీటి సరఫరా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం’ తదితర అంశాలపై టీజీపీఎస్సీ చైర్మన్, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జూన్ 9న ఉద యం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని, గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, వానకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిల్వలు కూడా జిల్లాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. వాటి పంపిణీలో ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవిలో తాగునీటిని విజయవంతంగా సరఫరా చేయడంలో అధికారులు సఫలీకృతులైనందున మరో 20 రోజులు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలని సూచించారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై సర్వే నిర్వహించి నివేదికను తమకు సమర్పించాలని సూచించారు. అలాగే, పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థికీ రెండు జతల సూల్ యూనిఫాం కుట్టించి అందజేయాలని ఆదేశించారు.
గ్రూప్-1 ప్రతిష్ఠాత్మకం: టీజీపీఎస్సీ చైర్మన్
అనంతరం, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్ష ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని అన్నారు. ఏ చిన్న పొరపాటు కూడా లేకుండా సజావుగా చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు: ఖమ్మం కలెక్టర్
అనంతరం ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షల కోసం జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18,403 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. శుక్రవారం ఫ్లయింగ్ స్వాడ్ అధికారులు, రూట్ అధికారులకు రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఏడీసీపీ ప్రసాదరావు, ఇతర అధికారులు రాజేశ్వరి, విజయనిర్మల, సన్యాసయ్య, శ్రీనివాస్, సోమశేఖరశర్మ, ఆఫ్రీన్ సిద్దిఖీ, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

