కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కంట్లో నలక పడినప్పుడు కంటి నుంచి నీరు కారడం, కండ్లు ఎర్రబడటం మామూలే. అయితే కండ్ల కలక బారినపడినప్పుడు కూడా ఇలాంటి బాధలు కనిపిస్తాయి. కండ్లు ఎర్రగా మారిపోయి నీరుకారుతూ ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల కండ్ల కలక వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు చికిత్సా, మార్గాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– సత్తుపల్లి/కూసుమంచి/రామవరం, ఆగస్టు 4
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో కండ్ల కలక వ్యాధి విస్తరిస్తున్నది. చిన్నపిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా కండ్ల కలక సమస్యతో బాధపడుతున్నారు. కండ్ల కలకను పింక్ అంటారు. కండ్ల కలక ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందని, రద్దీ ప్రదేశాల్లో చాలా సులభంగా వ్యాప్తి చెందే అవకాశముంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు పాటించడంతోపాటు కండ్ల కలక సోకితే సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు.
బ్యాక్టీరియా, వైరస్‌తో వ్యాప్తి ఎక్కువ..
కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్ప ల వెనుక ఉండే పొరను కంజెటైవా అంటారు. కండ్లు తెరచి ఉండడంతో దుమ్ము, ధూళి, వేడి, చలి, నీళ్లు ఏదైనా ప్రభావం చూపిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే కండ్ల కలక అంటారు. ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్‌తో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్గా అనిపించినా రోజూవారీ పనులు చేసుకోకుండా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తుంది. వానకాలంలో మురికి, కాలుష్యం పెరగడంతో కండ్ల కలక సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కండ్ల కలక వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో సంచరించవద్దని, ప్రయాణ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
అప్రమత్తంగా ఉండాలి,,
కండ్లకలక అంటువ్యాధి. వ్యాధి వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారు ఆందోళన పడకుండా వైద్యులను సంప్రదించాలి. వారు వాడే వస్తువులను ఇతరులు ఉపయోగించకుండా చూసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
– కె.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, సత్తుపల్లి
సొంతవైద్యం వద్దు…
కళ్ల కలక వచ్చిన వారు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ వైరస్ గాలిలో కలిసిపోతుందనేది కేవలం అపోహ మాత్రమే. వైద్యులను సంప్రదించకుండా బాధితులెవరూ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దు. సొంత వైద్యం వద్దు. కాంటాక్టు లెన్స్ ఉపయోగించే వారు కళ్లకలక వచ్చినప్పుడు వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. శుద్ధజలంతో కళ్లను శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన న్యాప్కిన్స్, టిష్యూ పేపర్ వాడాలి. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్యం పొందవచ్చు.
– డాక్టర్ హిమబిందు, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి