ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు
కొద్ది రోజుల క్రితం వరకు రూ.50లోపే ఉన్న కేజీ పచ్చిమిర్చి ధర.. పక్షం రోజులుగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.200కు చేరింది. దీంతో పచ్చిమిచ్చి కొనాలంటే కాదు.. ఆ పేరు వింటేనే వినియోగదారులకు ఘాటెక్కుతోంది.
- చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు
- డబుల్ సెంచరీ కొడుతున్న పచ్చిమిర్చి ధర
- ఖమ్మం జిల్లాలో ఊసేలేని ఉద్యాన పంటల సాగు
- ఇతర జిల్లాలు, రాష్ర్టాలపై ఆధారపడి దిగుమతి
- అధిక ధరలతో అవస్థలు పడుతున్న సామాన్యులు
ఖమ్మం వ్యవసాయం, మే 29: కొద్ది రోజుల క్రితం వరకు రూ.50లోపే ఉన్న కేజీ పచ్చిమిర్చి ధర.. పక్షం రోజులుగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.200కు చేరింది. దీంతో పచ్చిమిచ్చి కొనాలంటే కాదు.. ఆ పేరు వింటేనే వినియోగదారులకు ఘాటెక్కుతోంది. అధిక ధరల ప్రభావం ఒక్క పచ్చిమిర్చితోనే కాదు.. అన్ని కూరగాయలపైనా స్పష్టంగా కన్పిస్తోంది. టమాటా ధర కూడా రూ.100కు చేరింది. దీంతో గృహిణులు, సామాన్యులు ‘ఏం కొనేటట్టులేదు. ఏం తినేటట్టులేదు.’ అంటూ వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పూర్తిగా కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. వేసవికి తోడు రవాణా భారం ఎక్కువ కావడంతో ధరలు మరింత పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి గృహిణులకు ఏర్పడింది. ఏటా కొత్త పంటలు చేతికొచ్చే సమయంలో కొంత మేరకు ధరలు పెరగడం సహజమే అయినప్పటికీ నిరుటితో పోల్చితే ఈ ఏడాది ధరలు రెండింతలు పెరిగాయి. సీజన్‌కు అనుగుణంగా ఒక రకం కూరగాయల ధరలు పెరిగితే.. మరో రకం కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టేవి. కానీ ప్రస్తుతం ఉల్లిగడ్డలతో సహా అన్ని రకాల కూరగాయలూ పెరిగిపోయాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో వినియోగదారులపై పెను ప్రభావం చూపుతోంది.
ఖమ్మంలో 4 రకాల మార్కెట్లు..
ఖమ్మంలో నాలుగు రకాల కూరగాయల సముదాయాలు ఉన్నాయి. వీటిలో మొదటిది హోల్‌సేల్ కూరగాయల మార్కెట్. దీనిలో ఏ రకం కూరగాయలు కొనుగోలు చేయాలన్నా కనీసం 10 కేజీలు కొనాల్సిందే. రెండోది రిటైల్ కూరగాయల మార్కెట్. దీనిలో కనీసం పట్టు (2.5 కేజీలు) కొనాల్సిందే. మూడోవి రైతుబజార్లు. వీటిలో పావు కేజీ నుంచి ఎన్ని కేజీలైన కొనుగోలు చేయవచ్చు. ఇక నాలుగోవి చిల్లర దుకాణాలు. అక్కడ కూడా అంతే. విడిగా వంద గ్రాముల నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు.
ఉనికి కోల్పోతున్న ఉద్యాన సాగు
ఉద్యాన పంటల సాగుకు చిరునామాగా నిలిచిన ఖమ్మం జిల్లా నేడు ఆ పంటల సాగులో ఉనికి కోల్పోయే స్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి కొంతమేర సబ్సిడీలు ఉన్నప్పటికీ రైతులు పెద్దగా ఆసక్తిగా లేనట్లు కన్పిస్తోంది. పొరుగు జిల్లాల్లో పరిస్థితి ఇందుకు కొంత భిన్నంగా కన్పిస్తోంది. అక్కడ కొద్దోగొప్పో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. దీంతో చాలా వరకూ కూరగాయలను ఇతర జిల్లాలు, రాష్టాలను నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
రూ.300 ఖర్చుచేస్తే రెండు కవర్లు కూడా నిండట్లేదు..
ఈ రోజు కూరగాయలు కొనేందుకు ప్రైవేట్ మార్కెట్‌కు వచ్చాను. రూ.300 వెచ్చిస్తే కనీసం రెండు కవర్లకు సరిపడా కూడా కూరగాయలు రాలేదు. పచ్చిమిర్చి ధర అడిగితే కేజీ రూ.200 అన్నారు. ఇంత ధర ఎప్పుడూ లేదు. తప్పనిసరి పరిస్థితిలో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కూరగాయలు లేనిదే ఇల్లు గడవదు. ప్రతిరోజూ కూరగాయల కోసమే కనీసం రూ.100 వెచ్చించాలి కదా.
-కళావతి, గృహిణి, ఖమ్మం
కోతులు, రియల్ ఎస్టేట్ ప్రభావంతో సాగు తగ్గింది
జిల్లాలో ఉద్యానపంటల సాగు సుమారుగా లక్ష ఎకరాల్లో ఉంది. అయితే, కూరగాయల సాగు గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఖమ్మం శివారు మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఈ మండలాల్లో రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు పెరిగాయి. దీంతో కూరగాయల సాగుకు రైతులెవరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు కోతుల బెడద విపరీతంగా ఉంది.
బీవీ రమణ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

