మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి
- పర్యావరణ పరిరక్షణ కోసం చొరవ తీసుకోవాలి
- ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలి
- 31న విగ్రహాల ప్రతిష్ఠ, వచ్చే నెల 10న నిమజ్ఞనోత్సవం
- అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఖమ్మం కలెక్టర్
- ఖమ్మంలో అన్ని ఏర్పాట్లూ చేస్తాం: మేయర్, సుడా చైర్మన్
ఖమ్మం, ఆగస్టు 25: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని, భక్తులందరూ స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా ఉత్సవ కమిటీలు చైతన్యపర్చి ప్రోత్సహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఈ నెల 31న వినాయకచవితి సందర్భంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్ఞన ఏర్పాట్లపై కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, స్తంభాద్రి ఉత్సవ కమిటీ బాధ్యులతో గురువారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గడిచిన రెండేళ్ల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఈ సంవత్సరం మరింత మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 31 వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, సెప్టెంబర్ 10న నిమజ్జనోత్సవం నిర్వహించేలా ఉత్సవ కమిటీలు నిర్ణయించాయన్నారు.
ఈ నేపథ్యంలో మండపాల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్, లైటింగ్ తదితర వసతుల కోసం ఆయా మండపాలు, ఉత్సవ కమిటీల బాధ్యులు ముందస్తుగా ఆయా శాఖల అధికారుల వద్ద అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ప్రతిష్ఠించిన మట్టి విగ్రహాల్లో అతిపెద్ద, అత్యుత్తమ మట్టి విగ్రహాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. నగరంలో మున్నేరు, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో నిమజ్జన ఘాట్లు ఉంటాయన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. నిమజ్జనాల ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీరు, లైటింగ్, బార్కేడింగ్, నిమజ్జన ప్లాట్‌ఫామ్స్, క్రేన్స్ తదితర ఏర్పాట్లను నగర పాలక సంస్థ ద్వారా చేపట్టాలన్నారు. నిమజ్ఞన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అగ్ని ప్రమాదాల నివారణ కోసం ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల పరిధిలో నిమజ్జన ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీల బాధ్యుల సహకారంతో మరింత మెరుగైన వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తెలిపారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్.మధుసూదన్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏసీపీలు ప్రసన్నకుమార్, రామోజీ రమేశ్, వివిధ శాఖల అధికారులు సురేందర్, రాధిక, పుల్లారావు, శ్రీనివాస్, మాలతి, కిషన్‌రావు, టీ.వెంకటేశం, ఎన్.వెంకటపతిరాజు, రమాదేవి, సుజాత, రవీంద్రనాథ్, సూర్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

