బీఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటున్నదని, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులందరూ గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు.
- మహబూబాబాద్‌లో జనం లేక సీఎం సభ వెలవెల
- బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత
- మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి సమావేశం
మణుగూరుటౌన్, ఏప్రిల్ 24 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటున్నదని, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులందరూ గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి జనరల్‌బాడీ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన కవిత మాట్లాడుతూ అలవికాని హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుందన్నారు.
మహబూబాబాద్‌లో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు ప్రజలు ముఖం చాటేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, దళితబంధు ఊసేలేదని, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి చెల్లించిన దాఖలాలు లేవన్నారు. రాష్ర్టాభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు, ఓటములు సర్వసాధారణమని, అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ పోరాట పఠిమతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసినా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదవి ఆగస్టు 15లోపు ఊడిపోతుందనే భయంతో దొంగ హామీలు ఇస్తున్నారన్నారు. పినపాక ఎమ్మెల్యేగా గెలిచిన పాయం వెంకటేశ్వర్లు అడ్డూ అదుపు లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. ఎవరు దందాలు చేస్తున్నారో తేల్చుకోవడానికి రెడీ అని, దొంగ ట్రాక్టర్లు ఇసుక తోలకానికి గోదావరికి పోతే అర్ధరాత్రి అయినా లేచి వస్తానన్నారు.
ఎవరు ఎన్ని కేసులు పెట్టినా రేగా కాంతారావును భయపెట్టలేరన్నారు. 30న జరిగే కేసీఆర్ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, అశ్వాపురం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, బీఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సీనియర్ నాయకులు కోలేటి భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

