ప్రగతిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ..
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ సైన్యం ఊరూరా.. వీధివీధినా పర్యటిస్తున్నది. గడప గడపకూ వెళ్లి పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నది.
- నియోజకవర్గాల్లో జోరుగా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం
- సభలు, సమావేశాలు, రోడ్ షోలతో నేతలు బిజీబిజీ
- గడప గడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న శ్రేణులు
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ సైన్యం ఊరూరా.. వీధివీధినా పర్యటిస్తున్నది. గడప గడపకూ వెళ్లి పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నది. నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో ప్రసంగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

గురువారం ఖమ్మంలో మంత్రి పువ్వాడ, కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలంలో ఎమ్మెల్యే వనమా, పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలంలో ప్రభుత్వ విప్ రేగా, అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే మెచ్చా, భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలంలో అభ్యర్థి తెల్లం, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర, పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఎమ్మెల్యే కందాళ, ఇల్లెందు నియోజకవర్గం బయ్యారం మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ, వైరా నియోజకవర్గం కారేపల్లి మండలంలో అభ్యర్థి మదన్లాల్, మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో అభ్యర్థి కమల్రాజు విస్తృతంగా ప్రచారం చేశారు.
-ఖమ్మం, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)


Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

