ఇందిరమ్మ ఇళ్లలో ఇచ్చింది తక్కువ.. బుక్కింది ఎక్కువ
తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. వారి పాలనలో అన్ని వర్గాల ప్రజలూ అరిగోస పడ్డారని అన్నారు. వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లలో పేదలకు ఇచ్చిందని తక్కువని, ఆ పార్టీ నేతలు బుక్కింది ఎక్కువని దుయ్యబట్టారు.
- తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణం
- బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం
- ఐదేళ్లలో 2,500 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చాం
- ఖమ్మం ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్
ఖమ్మం, నవంబర్ 25: తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. వారి పాలనలో అన్ని వర్గాల ప్రజలూ అరిగోస పడ్డారని అన్నారు. వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లలో పేదలకు ఇచ్చిందని తక్కువని, ఆ పార్టీ నేతలు బుక్కింది ఎక్కువని దుయ్యబట్టారు. ఖమ్మం నగరంలో శనివారం పర్యటించిన ఆయన.. పలు డివిజన్లలో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. 21వ డివిజన్లో పార్సీబంధం, మాణిక్యంనగర్, పాకబండబజార్లలో ప్రజలను పేరుపేరునా పలుకరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం భూమి పుత్రుడినైన తనను గెలిపిస్తే ఇక్కడి ప్రజల మధ్యే ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడునీడగా నిలుస్తానని అన్నారు. బయటి వ్యక్తులను ఆదరిస్తే వారు గెలిచినా, ఓడినా మళ్లీ ఇక్కడ కన్పించరని అన్నారు.
తాను మంత్రిగా ఉన్న ఈ ఐదేళ్లలో ఖమ్మంలో 2,500 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందించామని అన్నారు. తనను మరోసారి గెలిపిస్తే 10 వేల మంది పేదలకు ప్రభుత్వ స్థలాలు పంపిణీ చేసి గృహలక్ష్మి పథకం ద్వారా వాటిల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. గతంలో నగర ప్రజలంతా తాగునీటి కోసం అలమటించేవారని, కొంతమందైతే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకునేవారని గుర్తుచేశారు. కానీ తాను వచ్చాక ఇంటింటికీ నల్లా కనెక్షన్లు పెట్టించానని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలాలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ను మరోసారి గెలిపిస్తే నూతన మ్యానిఫెస్టో అమలవుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో తనపై పోటీ చేస్తున్న వ్యక్తి గతంలో ఇక్కడ ఏ అభివృద్ధీ చేయలేదని అన్నారు. కానీ ఇక్కడ తాను చేసిన అభివృద్ధిని అతను చేసినట్లుగా ఇప్పుడు చెప్పుకుంటూ ఇక్కడి ప్రజలను ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు ఆళ్ల నిరీశ, ప్రశాంతలక్ష్మి, కర్నాటి కృష్ణ, బీఆర్ఎస్ నేతలు అమరగాని వెంకన్న, పల్లా రాజశేఖర్, షకీనా తదితరులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

