తండ్రి నడుపుతున్న రొటోవేటర్‌లో పడి.. ఐదేళ్ల బాలుడి దుర్మరణం
తాను కన్న కుమారుడే తన చేతిలో ఎన్నటికీ కానరాని లోకాలకు వెళ్తాడని బహుశా ఏ తండ్రీ ఊహించి ఉండడు. తన కన్నయ్యే (కొడుకు) సరదాగా తనతోపాటు చేనుకు వస్తానంటే ఏ తండ్రి మాత్రం వద్దనగలడు? కానీ ఆ సరదానే తన కన్నయ్యను తనకు దూరం చేస్తుందని ఆ తండ్రి కలలో కూడా కలగని ఉండడు. కానీ ఘోరం జరిగింది.
- కన్న తండ్రి కళ్లెదుటే ముక్కలుముక్కలైన కుమారుడు
- సెలవుదినం కావడంతో తండ్రితో కలిసి చేనుకు వెళ్లిన కొడుకు
- కొద్దిసేపట్లోనే తునాతునకలై విగతజీవిగా ఇంటికి..
- ఖమ్మం జిల్లా కూసుమంచి కొత్తతండాలో విషాదం
తాను కన్న కుమారుడే తన చేతిలో ఎన్నటికీ కానరాని లోకాలకు వెళ్తాడని బహుశా ఏ తండ్రీ ఊహించి ఉండడు. తన కన్నయ్యే (కొడుకు) సరదాగా తనతోపాటు చేనుకు వస్తానంటే ఏ తండ్రి మాత్రం వద్దనగలడు? కానీ ఆ సరదానే తన కన్నయ్యను తనకు దూరం చేస్తుందని ఆ తండ్రి కలలో కూడా కలగని ఉండడు. కానీ ఘోరం జరిగింది. విధి వక్రీకరించింది. తాను పక్కనుండగా తన కన్నయ్యపై ఈగను కూడా వాలనీయనన్న ఆ తండ్రి ధైర్యం, తన తండ్రి తన పక్కనుండగా తనను మరేమీ తాకలేదన్న భరోసా.. రెండూ విధి ముందు నిజం కాలేకపోయాయి. తనవెంట వస్తానంటూ మారం చేసిన కొడుకును ముద్దుచేస్తూ తీసుకెళ్లిన ఆ తండ్రి.. కొద్ది నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా తీసుకొచ్చిన విషాదం.. కూసుమంచి మండలంలోనిది..
కూసుమంచి, ఆగస్టు 24: ఐదేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు తండ్రి సమక్షంలోనే, తండ్రి నడుపుతున్న రొటోవేటర్‌లో పడి తునాతునకలై దుర్మరణం చెందిన విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండా పరిధిలోని కొత్తతండాకు చెందిన వడ్తియా రాంబాబు – దీపిక దంపతులకు భువనేశ్వర్ (5) అనే కుమారుడు, భువనేశ్వరి అనే కుమార్తె (కవలలు) ఉన్నారు. కుమారుడు భువనేశ్వర్ కూసుమంచిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు.
ఆదివారం సెలవుదినం కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. తండ్రి రాంబాబు సాయంత్రం సమయంలో చేను దున్నేందుకు ట్రాక్టర్‌కు రొటోవేటర్‌ను లింక్ చేసుకొని తోలుకుంటూ బయలుదేరాడు. అయితే, తాము కూడా వస్తామంటూ కుమారుడు భవనేశ్వర్, అతడి స్నేహితుడైన మరో బాలుడు మారం చేయడంతో వారిని ట్రాక్టర్ వెనుక రొటోటేటర్పై కూర్చోబెట్టుకొని చేను వద్దకు వెళ్లాడు. అక్కడ రొటోవేటర్ పైభాగంలో కుమారుడు భువనేశ్వర్‌ను, అతడి స్నేహితుడైన మరో బాలుడిని కూర్చోబెట్టుకొని రాంబాబు తన చేను చదును చేస్తున్నాడు.
ఈ క్రమంలో కుమారుడు భువనేశ్వర్ ప్రమాదవశాత్తూ జారి ఒక్కసారిగా రొటోవేటర్ కింద పడిపోయాడు. క్షణాల్లోనే అతడి తల, మొండెం, ఇతర శరీర భాగాలు ముక్కలుముక్కలై వేరువేరుగా పడిపోయాయి. ఆ వెంటనే భువనేశ్వర్ పక్కన కూర్చున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో రాంబాబు వెనక్కు తిరిగి చూశాడు. అప్పటికే అతడి కుమారుడి దేహమంతా తునాతునకలైంది. వాటన్నింటినీ తండ్రి ఒక్క దగ్గర చేర్చి బోరున విలపించాడు. తాను కన్న కొడుకునే తన చేతులారా పోగొట్టుకున్నానంటూ తల్లడిల్లిపోయాడు. ఈ విషాదకర ఘటనను చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

