చివరి ఆయకట్టుకూ ‘భక్తరామదాసు’ నీళ్లు
నిత్యం కరువు కాటకాలతో ఉండే పాలేరు నియోజకవర్గం రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సహకారం, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 2016లో పాలేరు రిజర్వాయర్‌పై కూసుమంచి ఎర్రగడ్డతండా వద్ద భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.
- ప్రజాప్రతినిధుల చొరవతో శరవేగంగా పనులు
కూసుమంచి రూరల్, మార్చి 22: నిత్యం కరువు కాటకాలతో ఉండే పాలేరు నియోజకవర్గం రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సహకారం, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 2016లో పాలేరు రిజర్వాయర్‌పై కూసుమంచి ఎర్రగడ్డతండా వద్ద భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధానంగా గ్రామాల్లోని చెరువులను నింపుతూ భూగర్భ జలాలను పెంచడంతోపాటు, 76,030 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. 34,356 ఎకరాలు, కూసుమంచిలో 21,140, ఖమ్మం రూరల్‌లో 16,512, నేలకొండపల్లిలో 1530, ముదిగొండలో 2523 ఎకరాలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
ప్రస్తుతం తిరుమలాయపాలెం మండలంలో 55 వేల ఎకరాలకు భక్తరామదాసు నీరు అందుతుండగా, మిగిలిన 21 వేల ఎకరాలకు వివిధ కారణాలతో పనులు నిలిచిపోయాయి. కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లో మరికొన్ని గ్రామాలకు కాలువలను విస్తరించాల్సి ఉన్నది. ప్రధానంగా కూసుమంచి మండలంలోని గట్టుసింగారం, జుజ్జల్‌రావుపేట, గురువాయిగూడెం, మల్లేపల్లి తదితర గ్రామాల్లో పదివేల ఎకరాల వరకు నీరు అందాల్సి ఉన్నది.
కాలువల నిర్మాణానికి తగినంత పరిహారం అందలేదని పలువురు రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించారు. మరికొందకు అధిక పరిహారం కోసం కోర్టుకు వెళ్లారు. ఈ దశలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో మాట్లాడి కేసులను ఉపసంహరింపజేయడంతో కాలువల విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు కాలువల నిర్మాణం, పైప్‌లైన్ పనులను చేపట్టారు. త్వరలోనే ప్రతిపాదిత గ్రామాల భూములకు కూడా సాగునీరు అందనున్నది. మిగిలిన భూములకు కూడా సాగునీరు అందితే పాలేరు నియోజకవర్గం పూర్తిస్థాయిలో సస్యశ్యామలం అవుతుందని ఈ ప్రాంత రైతులు భావిస్తున్నారు.
ఆరేళ్లలో పెరిగిన సాగు..
మా గ్రామానికి పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా.. దశాబ్దాలుగా సాగునీరు అందలేదు. కేవలం మెట్ట పంటలనే సాగు చేసేవాళ్లం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పాలేరు రిజర్వాయర్‌పై భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నిర్మించడంతో పాలేరు రూపురేఖలు మారిపోయియి. ఈ నీటితో చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఆరేళ్లలో మిర్చి, పత్తితో పాటు వరిసాగు గణనీయంగా పెరిగింది. అన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
– ముల్కూరి శ్యామ్‌సుందర్‌రెడ్డి, సర్పంచ్, గైగొళ్లపల్లి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

