జిల్లాలో 19 వరకు బడిబాట
జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని, గురువారం నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు.
- పాఠశాలల మరమ్మతు పనులన్నీ పూర్తి చేయండి
- 85 శాతం పాఠ్యపుస్తకాలను మండలాలకు పంపిణీ చేశాం..
- మండల ప్రత్యేకాధికారులతో సమీక్షించిన భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని, గురువారం నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. జిల్లాలో చేపడుతున్న బడిబాట, పాఠ్య పుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పనులు, పారిశుధ్యం, విత్తనాలు, సీజనల్ వ్యాధులు, తాగునీరు తదితర అంశాలపై మండల ప్రత్యేకాధికారులతో గురువారం ఐడీవోసీ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని లేబర్ ఆఫీసర్లను ఆదేశించారు. 642 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన మరమ్మతు పనులు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులను ఈ నెల 12వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 85 శాతం పుస్తకాలను అన్ని మండల కేంద్రాలకు తరలించామని, సోమవారం నాటికి పూర్తి కావాలన్నారు.
జిల్లాలో 1,299 పాఠశాలలకు అవసరమైన 63,399 ఏకరూప దుస్తులకు.. 50,300 ఏకరూప దుస్తుల తయారీ పూర్తయిందని, మిగిలినవి రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలన్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున తరగతి గదులు, పాఠశాల ఆవరణను శుభ్రం చేయించాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. జిల్లాలో 5,41,000 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం ఉండగా.. 4,94,000 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, 564 దుకాణాల ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా విక్రయాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు 1,05, 000 ప్యాకెట్ల పత్తి విత్తనాలు విక్రయించారని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఆర్డీవో విద్యాచందన, అన్ని మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

