Kothagudem | గ్రామస్థాయి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదులు..

కొత్తగూడెం : గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ బలోపేతం అవుతుందంటే అది కార్యకర్తల గొప్పతనమేనని టీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావులు అన్నారు. జిల్లాకేంద్రంలో బస్‌స్టాండ్ సెంటర్లో టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీకి బలమైన పునాదులే కార్యకర్తలని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో పార్టీ బలోపేతం అయిందని రానున్న రోజుల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని వారు జోస్యం చెప్పారు. మన పథకాలే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు.
ఈ సమావేశంలో జెడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు,మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బాదావత్ శాంతి, సోనా, విజయలక్ష్మి, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతురావు, మార్కెట్ చైర్మన్ రాంబాబు, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, టీఆర్ఎస్ నాయకులు ఆళ్లమురళి, మున్సిపల్ కౌన్సిలర్లు, బాగం మోహన్‌రావు,లింగం పిచ్చిరెడ్డి, టీఆర్ఎస్వీ అధ్యక్షులు అనుదీప్,మోరె భాస్కర్‌రావు,టీబీజీకేఎస్ ప్రసిడెంట్ సోమిరెడ్డి, భీమా శ్రీధర్, కొట్టి వెంకటేశ్వర్లు, యూసుఫ్, సుందర్, బండి రాజుగౌడ్,హెస్సేన్, తులసిరెడ్డి, జక్కుల సుందర్, దూడల బుచ్చయ్య, మల్లెల ఉషారాణి, కొల్లు పద్మ, కృపావేణి, నక్కా సృజన తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

