“ఆరోగ్యకరమైన అలవాట్లు – ఆనందకర బాల్యం”
పిల్లల్లో నులి పురుగుల సమస్యను నివారించి, వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 13న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day)ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా..
– రుద్రంపూర్‌లో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ ర్యాలీ
రుద్రంపూర్, జూలై 11 : పిల్లల్లో నులి పురుగుల సమస్యను నివారించి, వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 13న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day)ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందజేయనుంది. ఇందులో భాగంగా చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏ.నాగ కుమారి ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నులి పురుగులు కలుషిత ఆహారం, నీరు, పరిశుభ్రత లోపం వల్ల శరీరంలోకి ప్రవేశించి పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, కడుపు నొప్పి, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలకు దారితీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఆరోగ్య శాఖ సూచించిన మేరకు నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.
ఆరోగ్య నిపుణులు సూచించిన ముఖ్య జాగ్రత్తల్లో భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, చెప్పులు ధరించడం, మరుగుదొడ్లను వినియోగించడం, సురక్షితమైన తాగునీరు సేవించడం, ఆహారాన్ని పరిశుభ్రంగా తయారు చేసి మూతపెట్టి ఉంచడం ఉన్నాయి. అలాగే నులిపురుగుల నివారణ మాత్రలు పూర్తిగా సురక్షితమైనవని, అవి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వైద్యాధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్ర వేయించి, ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. “ఆరోగ్యకరమైన అలవాట్లు – ఆనందకర బాల్యం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ సుభద్రమ్మ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సత్యవతి, టీచర్ రాజరాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

