Sand Mafia | సోంపల్లి ఇసుక ర్యాంపులో అక్రమ ఇసుక రవాణా.. లారీలను అడ్డుకున్న స్థానికులపై దాడి..?
Sand Mafia | ర్యాంపు వద్ద స్థానికులపై నిర్వాహకులు దాడిచేసిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆదివారం బ్లూకోట్ కానిస్టేబుల్, హోంగార్డు విచారణకు వచ్చి విచారణ అనంతరం తిరిగి వెళుతుండగా ఇసుకలారీ పోలీసు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలుకావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.
Sand Mafia | బూర్గంపహాడ్, జూన్ 14 : బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా జీరో వ్యాపారం జరుగుతుందని బీసీ కాలనీకి చెందిన కొందరు యువకులు, గ్రామస్థులు ర్యాంపులో శనివారం రాత్రి ఇసుక లారీలను నిలిపివేసే ప్రయత్నం చేయగా ఆ సమయంలో ర్యాంప్ నిర్వాహకులకు చెందిన కొందరు దాడి చేశారని.. ఈ విషయంపై మాట్లాడేందుకు గ్రామస్థులు ఆదివారం కూడా ర్యాంపు వద్దకు వెళ్లినట్లు తెలిసింది.
ర్యాంపు వద్ద స్థానికులపై నిర్వాహకులు దాడిచేసిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆదివారం బ్లూకోట్ కానిస్టేబుల్, హోంగార్డు విచారణకు వచ్చి విచారణ అనంతరం తిరిగి వెళుతుండగా ఇసుకలారీ పోలీసు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలుకావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుక ర్యాంపుల నిర్వాహకులు చేసేది అక్రమ వ్యాపారమైనా ఇలా ప్రశ్నించిన, అడ్డుకున్న వారిపై దాడులు చేయించడం ఏమిటని ప్రజలు మండిపడుతున్నారు.
పోలీసులకే రక్షణ కరువైందా…?
అసాంఘీక శక్తులను అణిచివేసే రక్షకభటులకే రక్షణ కరువైందా అనే అనుమానం తాజాగా బూర్గంపహాడ్ మండలం సోంపల్లి వద్ద జరిగిన సంఘటనతో రుజువైంది. సోంపల్లి ర్యాంపు వద్ద లారీలను స్థానికులు అడ్డుకుంటున్నారన్న సమాచారం రావడంతో బ్లూకోట్ కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించి అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా సమర్థవంతంగా వ్యవహరించి తిరిగి వస్తుండగా లారీ వెనుక నుంచి పోలీసు వాహనాన్ని ఢీకొట్టడంతో వారు ప్రమాదానికి గురై భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు చెప్పడం వెనుక ఇసుక ర్యాంపు నిర్వాహకుల దాడులు ఏవిధంగా ఉన్నాయో తేటతెల్లమవుతోంది.
బూర్గంపహాడ్ మండలంలో ఇలాంటి మసలు ఇప్పటికే పలుమార్లు చోటుచేసుకున్నాయని ఇసుక అక్రమార్కులు ఆక్రమ రవాణా అడ్డుకునే, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం కొత్తకాదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
సోంపల్లి ఘటనపై బూర్గంపహాడ్ ఎస్సై క్లారిటీ..
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద స్థానికులు లారీలను అడ్డుకుంటున్నారని సమాచారం రావడంతో బ్లూకోట్ సిబ్బంది మంగీలాల్, శ్రీనివాసరావులు అక్కడకు వెళ్లి గ్రామస్తులకు సర్థి చెప్పి పంపించారని ఎస్సై మేడా ప్రసాద్ స్పష్టం చేశారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై తిరిగి దోమలవాగు నుంచి బయటకు వస్తున్న క్రమంలో లారీ(ఏపీ16టీజే3569) డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపి ముందున్న బ్లూకోట్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డు శ్రీనివాసరావులకు గాయాలుకావడంతోపాటు బైక్, రెండు ట్యాబల్ ధ్వంసమైనట్లు ఎస్పై తెలిపారు. గాయపడిన వారిని భద్రాచలం ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read also :
Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

